- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జీహెచ్ఎంసీలో ఈ-వేస్ట్, బయోమెడికల్ వ్యర్థాలకు ప్రత్యేక డ్రైవ్: అధికారులకు కమిషనర్ కీలక ఆదేశాలు
గ్రేటర్ హైదరాబాద్ లో 100 శాతం ఈ-వేస్ట్, బయో మెడికల్ వ్యర్థాల సేకరణ చేపట్టేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ అధికారులను ఆదేశించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ లో 100 శాతం ఈ-వేస్ట్, బయో మెడికల్ వ్యర్థాల సేకరణ చేపట్టేలా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ. కర్ణన్ అధికారులను ఆదేశించారు. బయోమెడికల్ వ్యర్థాలను ఎట్టిపరిస్థితుల్లోనూ మున్సిపల్ వ్యర్థాలతో కలపొద్దని ఆదేశించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు. క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ కార్పొరేషన్ లలో శాస్త్రీయ వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేసే దిశగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ-వేస్ట్ రీసైక్లర్లు, బయోమెడికల్ వ్యర్థాల శుద్ధి సంస్థలు, సీఎస్‌ఆర్ భాగస్వాములతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌లో సమావేశం నిర్వహించింది. సమావేశంలో జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ మాట్లాడుతూ.. బయోమెడికల్ వ్యర్థాల సేకరణలో ఎటువంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని అన్నారు. నిబంధనల ప్రకారం వ్యర్థాలను సేకరించని సంస్థలపై నోటీసులు జారీ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆసుపత్రులు, ఆరోగ్య సంస్థలు నిర్దేశిత నియమాలు, యూజర్ ఛార్జీలు పాటించేలా ఏఎంఓహెచ్‌లతో సమన్వయం చేస్తామని తెలిపారు. నగరాన్ని పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా మార్చేందుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఈ-వేస్ట్ సేకరణ కార్యాచరణపై వివరించారు. ప్రతి సర్కిల్‌లో ప్రత్యేక సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలు స్వచ్ఛందంగా ఈ-వేస్ట్ ఇచ్చేలా ప్రోత్సహిస్తామని చెప్పారు. అదనంగా ప్రతి శనివారం, ఆదివారం క్యూర్ పరిధిలోని 300 వార్డుల్లో వార్డు స్థాయి సేకరణ డ్రైవ్‌లు నిర్వహిస్తామని తెలిపారు. సంస్థలు ఆయా సర్కిళ్లు, వార్డులతో భాగస్వామ్యం చేసుకుని సేకరణ కేంద్రాల్లో ప్రతినిధులను నియమించాలని సూచించారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు కూపన్లు, నగదు ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రోత్సహించారు.
యూపీఐ లేదా నగదు రూపం..
జీహెచ్ఎంసీ అదనపు కమిషనర్ (శానిటేషన్) రవి కిరణ్ మాట్లాడుతూ, సేకరణకు అవసరమైన మౌలిక వసతులు జీహెచ్ఎంసీ అందిస్తుందని, అయితే ధరలు, చెల్లింపులు, ప్రోత్సాహకాలు పూర్తిగా సంస్థల పరిధిలోనే ఉంటాయని స్పష్టం చేశారు. సమావేశంలో పలు సంస్థలు యూపీఐ లేదా నగదు రూపంలో ప్రత్యక్ష చెల్లింపులకు అంగీకరించగా, మరికొన్ని సంస్థలు సీఎస్‌ఆర్ కింద రిడీమబుల్ కూపన్లు అందించేందుకు ముందుకొచ్చాయి. ఈ-వేస్ట్ ఉన్న ఇళ్ల వివరాలను రిటైల్ వ్యాపారులతో పంచుకుంటే, డోర్ టు డోర్ సేకరణకు సమన్వయం చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ హెల్త్ అదనపు కమిషనర్ ప్రియాంక అల, శానిటేషన్ అదనపు కమిషనర్ లు రవి కిరణ్, రఘు ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఎస్ఈ సృజన శ్రీ, ఈ-వేస్ట్ రీ సైకిల్, హ్యాండ్లింగ్ సంస్థలు, బయో మెడికల్ హ్యాండ్లింగ్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.






