- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : మిస్ వరల్డ్ అందగత్తెలకు స్పెషల్ విందు... హాజరైన సీఎం రేవంత్ రెడ్డి
మిస్ వరల్డ్(Miss World) అందగత్తెలు నేడు హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్(Charminar) వద్ద హెరిటేజ్ వాక్(Heritage Walk) చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : మిస్ వరల్డ్(Miss World) అందగత్తెలు నేడు హైదరాబాద్ లోని చారిత్రాత్మక కట్టడం చార్మినార్(Charminar) వద్ద హెరిటేజ్ వాక్(Heritage Walk) చేశారు. హెరిటేజ్ వాక్ వచ్చిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లకు సంప్రదాయ అరబ్బీ, మర్ఫా సంగీతంతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం వారంతా చార్మినార్ పరిసరాల్లో తిరుగుతూ ఫోటోలు, సెల్ఫీలతో హాల్ చల్ చేస్తూ మైమరచి పోయారు. చార్మినార్ సమీపంలోని చుడీ బజారులో ఎంపిక చేసిన తొమ్మిది దుకాణాల్లో వివిధ రకాల గాజులు, ముత్యాల హారాలు తదితర అలంకరణ వస్తువుల షాపింగ్ నిర్వహించారు. అనంతరం వీరందరికీ సుప్రసిద్ధ చౌహముల్లా ప్యాలెస్(Chowmahalla Palace)లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కుటుంబ సమేతంగా హాజరయ్యారు.
విందులో ఏర్పాటు చేసిన ప్రత్యేక హైదరాబాదీ వంటకాల(Hyderabad Special Dishes)కు అందగత్తెలు ఫిదా అయ్యారు. హైదరాబాద్ అతిధ్యం తమను మురిపిస్తోందని, ఇదొక మర్చిపోలేని మెమొరీ అన్నారు. "తెలంగాణ జరూర్ ఆనా" నినాదం తమ దేశాల్లో వినిపిస్తామని ఈ సందర్భంగా వారు సీఎం రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు. విందు అనంతరం చౌముల్లా ప్యాలెస్ లో నిజాం హయాంలో ఉపయోగించిన యుద్ధ ఆయుధాలు, గృహోపకరణ సామాగ్రి, నిజాం నవాబులు ఉపయోగించిన వివిధ రకాల వస్తువులు, ఓల్డ్ సిటీ సంస్కృతి సాంప్రదాయాలను తెలియజేసే ఫోటో ప్రదర్శనలు జరిగింది. నవాబులు, నిజాంల గురించి కంటెస్టెంట్స్ ఆసక్తిగా తెలుసుకున్నారు.






