డెస్క్ జర్నలిస్టులకు నష్టం జరగదు.. స్పెషల్ కమిషనర్ ప్రియాంక హామీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-12-27 15:15:00  IST  )

డెస్క్ జర్నలిస్టులకు నష్టం జరగదు.. స్పెషల్ కమిషనర్ ప్రియాంక హామీ

డెస్క్ జర్నలిస్టులకు నష్టం జరగదు.. స్పెషల్ కమిషనర్ ప్రియాంక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని వర్కింగ్ జర్నలిస్టుందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. జర్నలిస్టుల మధ్య విభజన సరికాదని అభిప్రాయపడింది. రిపోర్లర్లు, డెస్క్ జర్నలిస్టులు అనే వివక్ష చూపొద్దని సూచించింది. ప్రస్తుతం ఉన్న ఆక్రిడిటేషన్ కార్డులను తగ్గించకుండా యధావిధిగా కొనసాగించాలని కోరింది, శనివారం హైదరాబాద్లోని సమాచార భవన్లో స్పెషల్ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, సచివాలయంలో ముఖ్యమంత్రి సీపీఆర్వో డాక్టర్ గుర్రం మల్సూర్ను వేర్వేరుగా ఫెడరేషన్ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా జీవో 252, తాజా పరిణామాలు, పరిష్కారాలపై చర్చించారు. పాత, కొత్త జీవోలకు సంబంధించి విషయాలను సుదీర్ఘంగా మాట్లాడారు.

జర్నలిస్టులంతా సమానమే..

తాజా జీవోతో తలెత్తిన పరిణామాలు, జర్నలిస్టుల ఆందోళనకు సంబందించి పలు అంశాలను స్పెషల్ కమిషనర్, సీపీఆర్వో దృష్టికి ఫెడరేషన్ నాయకులు తీసికెళ్లారు. ఈ సందర్భంగా స్పెషల్ కమిషనర్ ప్రియాంక స్పందిస్తూ అక్రిడిటేషన్ల విషయంలో వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం జరగదనీ, డెస్క్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వం అందించే అన్నీ వసతులు వర్తిస్తాయని హామీ ఇచ్చారు. సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి వర్కింగ్ జర్నలిస్టులకు నష్టం జరగకుండా చొరవ తీసుకుంటానని సీపీఆరోవో మల్సూరు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో టీడబ్ల్యూజేఎఫ్ కమిటీ కన్వీనర్ పి.రాంచందర్, ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి బి.బసవపున్నయ్య ఉ పాధ్యక్షులు బి.రాజశేఖర్, గుడిగ రఘు, కార్యదర్శులు బి. జగదీష్, గండ్ర నవీన్, హెచ్యూజే అధ్యక్షులు బి.అరుణ్ కుమార్, రాష్ట్ర నాయకులు కె.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story