- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG Municipal Election: ఉద్యోగులకు స్పెషల్ క్యాజువల్ లీవ్
by Gantepaka Srikanth |
రాష్ట్రంలో బుధవారం జరగనున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బుధవారం జరగనున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల సాధారణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఓటు హక్కు కలిగిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఎన్నికల రోజున 'స్పెషల్ క్యాజువల్ లీవ్' (ఎస్ సీఎల్) మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్లకు, జిల్లా ఎన్నికల అధికారులకు స్పష్టం చేసింది. తెలంగాణ ప్రభుత్వ పరిధిలో పనిచేస్తూ, ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న మున్సిపాలిటీలు లేదా కార్పొరేషన్లలో ఓటరుగా నమోదైన ఉద్యోగులందరికీ ఈ సెలవు వర్తిస్తుంది. ఓటర్లందరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చూడాలని, అర్హులైన ఉద్యోగులకు పోలింగ్ రోజున ఈ సెలవును అనుమతించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.
Next Story






