- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాకూ గృహవసతి కల్పించండి.. సీఎం రేవంత్‌కు న్యాయవాదుల విజ్ఞప్తి
న్యాయవాద వృత్తిలోకి ప్రతీ ఏటా చాలా మంది వస్తూ ఉన్నారని, ఇందులో పేద కుటుంబాలూ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించిన న్యాయవాదులు.

దిశ, తెలంగాణ బ్యూరో: న్యాయవాద వృత్తిలోకి ప్రతీ ఏటా చాలా మంది వస్తూ ఉన్నారని, ఇందులో పేద కుటుంబాలూ ఉన్నాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి వివరించిన న్యాయవాదులు... ప్రతి నెలా రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం నుంచి మూడేండ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్టైఫండ్ పేరుతో కొత్త న్యాయవాదులకు ఆర్థిక సాయం చేస్తూ ఉన్నదని, ఇందుకోసం జీవోను కూడా విడుదల చేసిందని, తెలంగాణ ప్రభుత్వం సైతం ఇదే తరహాలో విధాన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సచివాలయంలో ముఖ్యమంత్రితో బార్ కౌన్సిల్ తరఫున సమావేశమైన న్యాయవాదులు పలు విజ్ఞప్తులు చేశారు.
రాష్ట్రంలో న్యాయవాద వృత్తిలో ఉన్న చాలామందికి కనీస గృహవసతి కూడా లేదని, అద్దె ఇండ్లలో ఉంటున్నారని, వీరికి ప్రభుత్వం తరఫున సౌకర్యం కల్పించాలని సీఎంను కోరారు. ప్రతి నెలా వేలాది రూపాయల చొప్పున అద్దె చెల్లించుకోలేని స్థాయిలో ఉన్నారని, వారికి మార్కెట్ ధరకు ప్లాట్లను సమకూర్చాలని కోరారు. బార్ కౌన్సిల్‌కు ఏటా రూ. 100 కోట్ల చొప్పున కేటాయించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినందున ఆ నిధిని వెల్ఫేర్ ఫండ్‌కు జమ చేయాలని కోరారు. చనిపోయిన న్యాయవాదుల కుటుంబాలకు పరిహారంగా చెల్లించడానికి వెసులుబాటు లభిస్తుందని తెలిపారు. గత ప్రభుత్వం 2015లో రూ. 100 కోట్లను అడ్వొకేట్స్ వెల్ఫేర్ ఫండ్ ట్రస్టుకు ఇచ్చిందని, దాని ద్వారా న్యాయవాదులకు గ్రూపు ఇన్సూరెన్సు స్కీమును అమలు చేస్తున్నట్లు తెలిపారు.






