- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్పీకర్ అనర్హత వేటు ప్రచారం.. ఎమ్మెల్యే పదవికి దానం రాజీనామా?
బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అన్హరత వేటు వేయడం కంటే.. ఆయనతో రాజీనామా చేయించడమే బెటర్ అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది.

దిశ,తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచి కాంగ్రెస్‌లో చేరిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అన్హరత వేటు వేయడం కంటే.. ఆయనతో రాజీనామా చేయించడమే బెటర్ అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. దానం పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని బలమైన ఆధారాలున్నాయి. 2024లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో నాగేందర్ కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో స్పీకర్ ఆయనపై వేటు వేస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. స్పీకర్ నిర్ణయం కంటే ముందే దానంతో రాజీనామా చేయించేందుకు ఏఐసీసీ నేతలు సైతం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తున్నది. ఇలా చేయించక పోతే మిగతా 9 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్ అధిష్టానానికి న్యాయనిపుణులు సూచించినట్లు తెలుస్తున్నది. మరో వైపు బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేలు 10 మందిపై అక్టోబర్ 31వ తేదీలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు.. స్పీకర్‌కు గడువు ఇచ్చింది. దీనిపై అటు ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి.. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి స్పీకర్ వాగ్మూలం తీసుకుంటున్నారు. త్వరలో ప్రత్యక్ష విచారణ చేపట్టాలని భావిస్తున్నారు.
సన్నిహితులకు దానం క్లారిటీ
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం నాగేందర్ తన సన్నిహితులకు సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తున్నది. ఉప ఎన్నికల్లో మళ్లీ గెలిచేందుకు ఇప్పటి నుంచే కలిసి ప్లాన్ చేయాలని సూచించినట్లు సమాచారం. అయితే ఇప్పటికే ఫిరాయింపు ఎమ్మెల్యేల నుంచి వివరణలు తీసుకుంటున్న స్పీకర్ త్వరలో దానం నాగేందర్‌ను సైతం పిలిచే అవకాశం ఉంది. ఆ సమయంలోనే దానం తన రాజీనామా అంశాన్ని స్పీకర్‌కు వివరించి లేఖ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కోరుతారనే ప్రచారం జరుగుతున్నది. అయితే స్పీకర్ గడ్డం ప్రసాద్ వచ్చే నెల 6 నుంచి సుమారు మూడు వారాల పాటు ఫారిన్ టూర్‌కు వెళ్తారని, ఈ లోపే దానం తన రాజీనామాపై అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.






