- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ బిల్లుపై అమిత్ షాను రిక్వెస్ట్ చేసిన స్పీకర్
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల బిల్లు సాధించడం కత్తి మీద సాము అయింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చాకే స్థానిక ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించగా.. ఇపుడు ఆ ఇచ్చిన హామీని నిలబెట్టుకుందుకు అనేక తిప్పలు పడుతున్నారు. మరోవైపు హైకోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబరు 30 లోపు ముగియగా.. ఆ లోపు బిల్లుకు చట్టబద్దత కల్పించడానికి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో జాతీయ నాయకులు కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో నేడు ఢిల్లీ జరిగిన స్పీకర్ల సదస్సు సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి, బీసీ రిజర్వేషన్ బిల్లు ప్రస్తావన తెచ్చారు. తాము అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్దనే పెండింగ్ లో ఉందని, ఇదే విషయంపై సీఎం రేవంత్ రెడ్డి మిమ్మల్ని ప్రత్యేకంగా కలిసి విన్నవించారని గుర్తు చేసారు. ఈ బిల్లుకు త్వరగా చట్టబద్దత కల్పించేలా చూడాలని స్పీకర్ అమిత్ షాను రిక్వెస్డ్ చేయగా.. ఈ విషయన్ని తప్పకుండా పరిశీలిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారని సమాచారం.






