- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల అనర్హత తీర్పు.. కేటీఆర్‍పై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఫైర్
ఎమ్మెల్యేల అనర్హత తీర్పుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను స్పీకర్ తప్పుపట్టారు. 54 పేజీల తీర్పు కాపీని పూర్తిగా చదవాలని హితవు పలికారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో తీర్పుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ కేటీఆర్ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తాను ఇచ్చిన తీర్పును కేటీఆర్ సరిగ్గా అర్థం చేసుకోలేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. అనర్హత తీర్పుపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎంతమాత్రం సరికావని ఈ అంశంలో తాను ఇచ్చిన 54 పేజీల తీర్పు కాపీని కేటీఆర్ పూర్తిగా చదవాలన్నారు. తీర్పు కాపీని పూర్తిగా చదవిన తర్వాతే మాట్లాడాలన్నారు. ఎమ్మెల్యేల అనర్హతపై నా పరిధిలో నేను నిర్ణయం తీసుకున్నాను. ప్రతీది రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. అయితే ఈ వ్యవహారంలో స్పీకర్ నేరుగా కేటీఆర్ విమర్శలకు కౌంటర్ ఇవ్వడంతో తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.






