ప్రజా సమస్యలపై చర్చకు సభను ఎంత సమయమైనా నిర్వహిస్తున్నాం!

by Ajay Maddhiboyina |

చట్టసభలలో చర్చలు నిర్మాణాత్మకంగా జరగాలని, అవి ప్రజలకు ఉపయోగపడడంతో పాటు, న్యాయమైన చట్టాల రూపకల్పనకు ఉపయోగపడుతాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు.

ప్రజా సమస్యలపై చర్చకు సభను ఎంత సమయమైనా నిర్వహిస్తున్నాం!
X

దిశ, తెలంగాణ బ్యూరో : చట్టసభలలో చర్చలు నిర్మాణాత్మకంగా జరగాలని, అవి ప్రజలకు ఉపయోగపడడంతో పాటు, న్యాయమైన చట్టాల రూపకల్పనకు ఉపయోగపడుతాయని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఈ విషయంలో ముందంజలో ఉందని, ప్రజా సమస్యలపై చర్చించడానికి గౌరవ సభ్యులకు అవసరమైన సమయం ఇవ్వడంతో పాటుగా, ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. బెంగళూరులో జరుగుతున్న 11వ కామన్వెల్త్ పార్లమెంటరీ అసోసియేషన్ (సీపీఏ) ఇండియా రీజియన్ కాన్ఫరెన్స్ లో ప్రజల నమ్మకాన్ని పెంపొందించడానికి చట్టసభలు కృషి చేయడం మరియు ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడం అంశంపై గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర శాసనసభ ద్వారా నూతన సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించచామని, తద్వారా వారు శాసనసభ నియమాలను అర్థం చేసుకోవడంతో పాటుగా తమకు కేటాయించిన సమయాన్ని సమర్ధవంతంగా వినియోగిస్తున్నారన్నారు.

గత తెలంగాణ శాసనసభ సమావేశాలు అర్ధరాత్రి వరకు జరిగాయని మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నానని, ప్రజా సమస్యలపై చర్చించడానికి ఎంత సమయమైనా సభను సమావేశపరచడం అనేది తెలంగాణ శాసనసభ నిబద్ధతను సూచిస్తుందన్నారు. పారదర్శకత ద్వారా ప్రజల విశ్వాసం పెరుగుతుందని, శాసనసభ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేయడం ద్వారా ఇందులో ముఖ్యమైందని గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. ప్రజలకు అవసరమైన ప్రాధమిక వసతుల కల్పనతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, మహాలక్ష్మి వంటి ముఖ్యమైన పథకాలపై తెలంగాణ శాసనసభలో గౌరవ సభ్యులు తమ అభిప్రాయాలను తెలియపరిచారన్నారు. ప్రతి శాసనసభ సంవత్సరంలో విధిగా ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనేది నిర్ణయించాలని, నూతన సభ్యులకు అవగాహన, శిక్షణ తరగతులు, క్రమశిక్షణ కొరకు నియమావళిని రూపొందించాలన్నారు. మంచి ఫలితాలను పరస్పరం మార్పిడి చేసుకుని ఆచరించడానికి అన్ని రాష్ట్రాల శాసనసభల మద్య అంతర్గత సహకారం ఉండా గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, లేజిస్లేటివ్ సెక్రటరీ నరసింహా చార్యులు అధికారులు పాల్గొన్నారు.

Next Story