బిహార్‌కు తెలంగాణ-ఏపీ అసెంబ్లీల స్పీకర్లు

by Gantepaka Srikanth |
బిహార్‌కు తెలంగాణ-ఏపీ అసెంబ్లీల స్పీకర్లు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఈనెల 20, 21 తేదీలతో బిహార్ రాజధాని పాట్నాలో జరిగే 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్‌కు తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ హాజరు కాబోతున్నారు. సోమవారం శంషాబాద్​ఎయిర్​పోర్టు నుంచి ఆయనతోపాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ ముదిరాజ్, అసెంబ్లీ సెక్రటరీ నరసింహా చార్యులు, ఇతర అధికారులు వెళ్లారు. అదే విధంగా ఏపీ నుంచి శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉప సభాపతి రఘురామకృష్ణ రాజు కూడా కాన్పరెన్స్‌కు హాజరు కానున్నారు.

Advertisement

Next Story

Most Viewed