- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పార్టీ ఫిరాయింపుల తీర్పుపై స్పీకర్ ఏమన్నారంటే?
బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన(Party defections) 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన(Party defections) 10 మంది ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి చర్యలు తీసుకుంటున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) తెలిపారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తీసుకోవడానికి స్పీకర్‌కు సుప్రీంకోర్టు మూడు నెలల గడువు విధించిన విషయం తెలిసిందే. అంటే అక్టోబర్ 31, 2025లోపు నిర్ణయం తీసుకోవాలి. సుప్రీం ఆదేశాలపై స్పీకర్ మాట్లాడుతూ... సుప్రీంకోర్టు తీర్పు పూర్తి కాపీ అందిన తర్వాత న్యాయ నిపుణులతో సంప్రదించి, తదుపరి చర్యలను తీసుకుంటానని పేర్కొన్నారు.
అలాగే ఆ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించామని, వారు సమయం కావాలని కోరినట్టు తెలిపారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అనంతరం 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. దానం నాగేందర్ (ఖైరతాబాద్), తెల్లం వెంకట్ రావు (భద్రాచలం), కడియం శ్రీహరి (స్టేషన్ ఘనపూర్), పోచారం శ్రీనివాస్ రెడ్డి (బాన్సువాడ), ఎం. సంజయ్ కుమార్ (జగిత్యాల), అరెకపూడి గాంధీ (శేరిల్లింగంపల్లి), టి. ప్రకాష్ గౌడ్ (రాజేంద్రనగర్), బి. కృష్ణ మోహన్ రెడ్డి (గద్వాల్), జి. మహిపాల్ రెడ్డి (పటాన్‌చెరు), కాలె యాదయ్య (చేవెళ్ల) కాంగ్రెస్‌లో చేరారు. అ
యితే తాము ఆంటీ-డిఫెక్షన్ చట్టం కింద అనర్హతకు గురి కామని, తాము ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నామని, ముఖ్యమంత్రిని కేవలం మర్యాదపూర్వకంగా కలిసినట్లు ఈ ఎమ్మెల్యేలు కోర్టులో అఫిడవిట్‌లు సమర్పించారు. కానీ కోర్టులో వారంతా పార్టీ మారినట్టు బిఆర్ఎస్ బలమైన సాక్ష్యాలను చూపించడంతో వారిపై చర్యలు తీసుకోవాలని ధర్మాసనం తీర్పు వెలువరించింది.






