- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇస్రో, NRSCలతో ఓయూ కీలక ఒప్పందం
ఇస్రో, ఎన్ఆర్ఎస్‌సీలతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక ఒప్పందం చేసుకుంది. స్పేస్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 5 సవంత్సరాల కాల పరిమితితో ఒప్పందం కుదుర్చుకుంది.

దిశ, వెబ్ డెస్క్: ఇస్రో, ఎన్ఆర్ఎస్‌సీలతో ఉస్మానియా యూనివర్సిటీ కీలక ఒప్పందం చేసుకుంది. స్పేస్ టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పుల నేపథ్యంలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 5 సవంత్సరాల కాల పరిమితితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకు ఇంజనీరింగ్, టెక్నాలజీ విభాగంలో కొత్త డిగ్రీ మరియు పీజీ కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ఈ కోర్సులు అంతరిక్ష పరిశోధనకు సంబంధించి, ఉపగ్రహ పరిశోధనకు సంబంధించి తాజా సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు రూపొందించబడతాయి. ఈ ఒప్పందంలో భాగంగా శాస్త్రవేత్తలతో నేరుగా ఓయూ విద్యార్థులు ఇంటరాక్షన్ అవుతారు. అంటార్కిటికాలో ఉన్న శాస్త్రవేత్తలతో సైతం నేరుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇండియాలో స్పేస్ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న వేళ హైదరాబాద్ అడ్డగా ఓయూతో ఇస్రో, ఎన్ఆర్ఎస్‌సీ ఒప్పందం చేసుకోవడంతో రాబోయే కాలంలో స్పేస్ టెక్నాలజీలో తెలంగాణ కీలకంగా మారే అవకాశం ఉంది.






