- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నా తండ్రికి అందరూ ఒకటే.. SP చరణ్ ఎమోషనల్
నా తండ్రికి అందరూ ఒకటే.. SP చరణ్ ఎమోషనల్

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు, ఎస్పీ చరణ్(SP Charan) భావోద్వేగానికి లోనయ్యారు. రాజకీయాలకు అతీతంగా నా తండ్రి జీవించారని అన్నారు. ఆయనకు అందరూ ఒకటే అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం, తెలుగు ప్రజలు, బాలు విగ్రహం ఏర్పాటుకు నాలుగేళ్లుగా కృషి చేసిన బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. తన తండ్రి అందరితో ఎంత స్నేహపూర్వకంగా ఉండేవారన్న దానికి ఈ కార్యక్రమం ఓ నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి శ్రీధర్ బాబు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. భావితరాల కోసమే రవీంద్రభారతిలో బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. స్వర సార్వభౌమత్వానికి బాలసుబ్రహ్మణ్యం నిలువెత్తు నిదర్శనమని అభివర్ణించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. నెల్లూరులోని తన ఇంటిని వేద పాఠశాలకు బాలు ఇచ్చేశారని గుర్తు చేశారు.






