- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రవీంద్రభారతీలో SP బాలు విగ్రహం.. మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు
రవీంద్రభారతీలో SP బాలు విగ్రహం.. మహేశ్ కుమార్ గౌడ్ ఆసక్తికర వ్యాఖ్యలు

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాపాలన రెండేళ్ల సంబరాలను దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) మండిపడ్డారు. తెలంగాణలో మళ్లీ వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేశారు. వాయు కాలుష్యం వలన దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి చూస్తే బాధేస్తుందని చెప్పారు. ఢిల్లీ పరిస్థితి హైదరాబాద్‌కి రావొద్దన్న ఉద్దేశ్యంతో హీల్ట్ పాలసీ తీసుకొస్తున్నామని అన్నారు. హైదరాబాద్‌ను విశ్వ నగరంగా మార్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. ప్రజా పాలనలో వికాసం దిశగా తెలంగాణ ముందుకు పోతోందని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సామేత రూపంలో దేవుళ్ళ గురించి మాట్లాడితే మత రాజకీయం చేయడం తగదని వెల్లడించారు.
కుల, మతం పేరిట రాజకీయాలను ప్రజలు జీర్ణించుకోలేరని చెప్పారు. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చేందుకు తాము తాపత్రయ పడుతున్నామని అన్నారు. ప్రభుత్వం దూర దృష్టితో పనిచేస్తోందని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల పరిశ్రమల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని అభిప్రాయపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇన్ అండ్ ఔటర్ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినపుడూ ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యాలతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని తేలిపోయిందని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో విచ్చలవిడితనంగా దోపిడీ జరిగిందని ఆరోపించారు.
ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం విగ్రహం విషయంలో కుల, మతం పేరిట రాజకీయం సబబు కాదని అన్నారు. ఎస్పీబీ దేశం గర్వించదగ్గ గాయకుడని అన్నారు. కళాకారులు, సాహిత్యకారులకు కుల మతాలను ఆపాదించడం తగదని చెప్పారు.
Read More... కిషన్ రెడ్డి ఒక బ్రోకర్: సామా రామ్మోహన్ రెడ్డి






