- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కిషన్ రెడ్డి ఒక బ్రోకర్: సామా రామ్మోహన్ రెడ్డి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ నేతలపై కాంగ్రెస్ నేత సామా రామ్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డి ఒక బ్రోకర్ మండిపడ్డారు. తెలంగాణలో కిషన్ రెడ్డి కిరికిరి రెడ్డిగా మారారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి పదే పదే అడ్డుపడుతున్నారు.. కేటీఆర్ మాట్లాడే చిట్టిలను చూసి కిషన్ రెడ్డి కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఒకటే స్క్రిప్ట్‌ను కేటీఆర్, కిషన్ రెడ్డి జిరాక్స్ చేసి చదువుతున్నారని అన్నారు. రాష్ట్రానికి కిషన్ రెడ్డి తెచ్చింది ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో గాలిని కొనుక్కొని బతికే పరిస్థితి వచ్చింది.. తెలంగాణలో ఆ పరిస్థితి రాకూడదనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్ని్స్తున్నారు. హైదరాబాద్‌ను కూడా ఢిల్లీగా మార్చాలని కిషన్ రెడ్డి, కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి గాలికి మాట్లాడతా అంటే ఒప్పుకునేది లేదు.. మహేశ్వర్ రెడ్డికి చిట్టిలు అందించేది ఎవరో తెలియదా? అని అన్నారు.
హిల్ట్ పాలసీ కింద ఉన్నవి ప్రయివేట్ భూములు.. ప్రయివేట్ ఓనర్ల నిరుపయోగమైన భూములపై వాలంటరీగా వెసులుబాటు ఇస్తే కేటీఆర్‌కి నొప్పి ఏంటి?.. హిల్ట్ పాలసీలో ప్రభుత్వ భూమి లేదు.. దేవాలయాలపై జీఎస్టీ వేస్తే బీజేపీ నాయకులు మౌనంగా ఉంటారా? అని ప్రశ్నించారు. తెలంగాణ దేవాలయాలపై వేసిన జీఎస్టీ తగ్గించే దాకా పోరాడడానికి కిషన్ రెడ్డి వస్తాడా? అని అడిగారు. బీజేపీ నాయకులకు నరేంద్ర మోడీ ఒక్కడే దేవుడు.. నిజమైన హిందువులకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే మాట అన్నారని వివరణ ఇచ్చారు.






