- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రారంభం.. 3 డివిజన్లకే పరిమితమైన సౌత్ సెంట్రల్ రైల్వే
దక్షిణ మధ్య రైల్వే అధికారికంగా రెండుగా చీలిపోయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇన్నాళ్లు 7 డివిజన్లతో కళకళలాడిన దక్షిణ మధ్య రైల్వే సోమవారంతో ఆ వైభవాన్ని కోల్పోయింది. సోమవారం నుంచి అధికారికంగా దక్షిణ మధ్య రైల్వే రెండు ముక్కలు అయ్యింది. ఏపీలోని విశాఖపట్టణం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ సోమవారం నుంచే ప్రారంభమైంది. దీంతో సౌత్ సెంట్రల్ రైల్వే ఇప్పుడు కేవలం మూడు డివిజన్లకే పరిమితమైపోయింది. ఈ మూడు డివిజన్లలోనూ తెలంగాణ పరిధిలో ఉన్నది కేవలం హైదరాబాద్, సికింద్రాబాద్ డివిజన్లే కాగా.. మూడో డివిజన్ మహారాష్ట్రలోని నాందెడ్. మరోవైపు ఏపీలో ఉన్న నాలుగు డివిజన్లు (గుంతకల్, గుంటూరు, విజయవాడ, విశాఖ) మాత్రం ఆ రాష్ట్రానికే చెందినవి కావడం విశేషం. దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలో రైల్వే కార్యకలాపాల నిర్వహణలో భద్రతపై సమీక్ష జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కొత్త పరిధిలోకి వచ్చే ముగ్గురు డీఆర్ఎంలు మాత్రమే హాజరయ్యారు. ఏపీ కేంద్రంగా జోన్ ఏర్పాటు చేసిన కేంద్రం తెలంగాణ చిరకాల వాంఛ అయిన కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటు విషయంలో మాత్రం శీతకన్ను వేయడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తం అయిన సంగతి తెలిసిందే.
అందుబాటులోకి అధికారిక వెబ్‌సైట్..
దక్షిణ కోస్తా రైల్వే జోన్ వెబ్ సైట్ (https://scor.indianrailways.gov.in) సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఏపీకి చెందిన రైల్వే సమాచారం కోసం అక్కడి ప్రజలు ఈ వెబ్‌సైట్ ద్వారా పూర్తి వివరాలు తెలుుసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు.






