- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Good News: రేపటి నుంచి యలహంక, షాలిమర్‌కు ప్రత్యేక రైళ్లు
by Vemula.Srinu Prasad |
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది...

X
దిశ, వెబ్ డెస్క్: దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా నాలుగు ప్రత్యేక రైళ్ల(Special Trains)ను నడుతుపుతున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్లు చర్లపల్లి(Charlapalli)-యలహంక(Yelahanka)-షాలిమర్(Shalimar) మధ్య నడవనున్నట్లు తెలిపింది. సోమవారం రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి యలహంకు ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు చెప్పింది. అలాగే ఈ నెల 9న మధ్యాహ్నం ఒంటిగంటకు యలహంకలో బయల్దేరి చర్లపల్లికి చేరుకుంటుందని స్పష్టం చేసింది. మరోవైపు సోమవారం రాత్రి 9.35 గంటలకు చర్లపల్లి నుంచి షాలిమర్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు పేర్కొంది. ఇదే రైలు ఈ నెల 10న మధ్యాహ్నం 12.10 గంటలకు షాలిమర్‌లో బయల్దేరి చర్లపల్లికి చేరుకుంటుందని, ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటన విడుదల చేసింది.
Next Story






