దక్షిణ మధ్య రైల్వేలో ఒక్కరోజులో రూ. 1.08 కోట్ల టికెట్ చెకింగ్ ఆదాయం

by Ajay Maddhiboyina |

దక్షిణ మధ్య రైల్వేలో ఈ నెల13న ప్రత్యేక టికెట్ తనిఖీ కార్యక్రమంలో ఒక్కరోజులో అత్యధికంగా రూ. 1.08 కోట్ల ఆదాయం వసూలు అయ్యింది. సాధారణంగా ఒక రోజుకు సుమారు రూ. 47 లక్షల ఆదాయం మాత్రమే వస్తుంటుంది.

దక్షిణ మధ్య రైల్వేలో ఒక్కరోజులో రూ. 1.08 కోట్ల టికెట్ చెకింగ్ ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వేలో ఈ నెల13న ప్రత్యేక టికెట్ తనిఖీ కార్యక్రమంలో ఒక్కరోజులో అత్యధికంగా రూ. 1.08 కోట్ల ఆదాయం వసూలు అయ్యింది. సాధారణంగా ఒక రోజుకు సుమారు రూ. 47 లక్షల ఆదాయం మాత్రమే వస్తుంటుంది. సోమవారం నమోదైన కేసులు 16,105, ఇది రైల్వే చరిత్రలో అత్యధికంగా నమోదైన ఒక్కరోజు కేసుల సంఖ్య. అత్యధికంగా విజయవాడ డివిజన్లో రూ.36.91 లక్షలు టికెట్ లేని వారి నుంచి వసూలు అయ్యాయి. కాగా... టికెట్ లేని, అనధికారికంగా ప్రయాణించే వారిని పట్టుకోవడమే కాక, సరైన టికెట్‌తో ప్రయాణించే ప్రజలకు సౌకర్యాన్ని కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని ద.మ. రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.

తనిఖీల సందర్భంగా ఒక్క రోజులో డివిజన్ వారీ ఆదాయం:

విజయవాడ – రూ.36.91 లక్షలు,

గుంతకల్లు – రూ.28 లక్షలు

సికింద్రాబాద్ – రూ.27.9 లక్షలు

గుంటూరు – రూ.6.46 లక్షలు

హైదరాబాద్ – రూ.4.6 లక్షలు

నాందేడ్ – రూ.4.08 లక్షలు

Next Story