- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్.. హోలీ పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. దక్షిణ మధ్య రైల్వే ప్రకటన
హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు పలు మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ ద్వారా ప్రకటించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: హోలీ పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు మార్గాల్లో నడుస్తున్న ప్రత్యేక రైళ్ల సేవలను పొడిగిస్తున్నట్లు శుక్రవారం ట్వీట్ ద్వారా ప్రకటించింది. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాచిగూడ-మధురై, మదురై-కాచిగూడ, హైదరాబాద్-కొల్లం, కొల్లం-హైదరాబాద్, హైదరాబాద్-కన్యాకుమారి, కన్యాకుమారి-హైదరాబాద్ మార్గాల్లో ప్రత్యేక రైళ్లను నిర్ణీత కాలపరిమితి వరకు పొడిగించారు.హోలీ పండుగ నేపథ్యంలో ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, ఇబ్బందుల్లేని ప్రయాణాన్ని ప్రణాళికబద్ధంగా చేపట్టాలని దక్షిణ మధ్య రైల్వే సూచించింది.
పొడిగించిన ప్రత్యేక రైళ్ల వివరాలు..
07191 కాచిగూడ - మదురై : ప్రతి సోమవారం, మార్చి 2 నుంచి మార్చి 23 వరకు (మొత్తం 4 సర్వీసులు)
07192 మదురై - కాచిగూడ : ప్రతి బుధవారం, మార్చి 4 నుంచి మార్చి 25 వరకు (4 సర్వీసులు)
07193 హైదరాబాద్ - కొల్లం : ప్రతి శనివారం, ఫిబ్రవరి 28 నుంచి మార్చి 28 వరకు (5 సర్వీసులు)
07194 కొల్లం - హైదరాబాద్ : ప్రతి సోమవారం, మార్చి 2 నుంచి మార్చి 30 వరకు (5 సర్వీసులు)
07230 హైదరాబాద్ - కన్యాకుమారి : ప్రతి బుధవారం, మార్చి 4 నుంచి మార్చి 25 వరకు (4 సర్వీసులు)
07229 కన్యాకుమారి - హైదరాబాద్ : ప్రతి శుక్రవారం, మార్చి 6 నుంచి మార్చి 27 వరకు (4 సర్వీసులు)






