- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సౌమ్య కుటుంబానికి రూ.1కోటి రూపాయల చెక్కు అందజేత
ఇటీవల విధి నిర్వహణలో మరణించిన తెలంగాణ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి సాయం అందజేసింది.

X
దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల విధి నిర్వహణలో మరణించిన తెలంగాణ ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం రూ.కోటి సాయం అందజేసింది. దీంతోపాటు, గత సంవత్సరం అక్టోబరు డ్యూటీ చేస్తుండగా దుండగుల చేతిలో కత్తి పోటుకి గురై మృత్యవాత పడిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ కుటుంబానికి రూ. కోటి ఎక్స్-గ్రేషియా ఇచ్చారు. ఈ సహాయానికి సంబంధించిన చెక్కులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా నిజామాబాద్‌లో ఆ కుటుంబాలకు స్వయంగా అందజేశారు.
నిజామాబాద్‌లో జనవరి 23న అక్రమంగా గంజాయి తరలిస్తున్న ముఠాను పట్టుకునేందుకు ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా సౌమ్య ప్రయత్నించారు. ఈ క్రమంలో అక్రమ రవాణాదారులు ఆమెను వాహనంతో ఢీకొట్టారు. దీంతో తీవ్రగాయాలు కావడంతో హైదరాబాద్ నిమ్స్‌లో సౌమ్యకు చికిత్స పొందుతూ మృతిచెందిన విషయం విదితమే.
హైదరాబాద్‌తో సమానంగా నల్గొండను అభివృద్ధి చేస్తా: మంత్రి కోమటిరెడ్డి
Next Story






