- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ponguleti: త్వరలో అదనంగా తహశీల్దార్లు.. ఎన్నికల వేళ మంత్రి పొంగులేటి సంచలన ప్రకటన
కేటీఆర్ పగటి కలలు మానుకోవాలని మంత్రి పొంగులేటి సెటైర్లు వేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: త్వరలోనే రాష్ట్రంలోని ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలకు అదనంగా ఎమ్మార్వోలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. రాష్ట్రంలోని లక్ష 50 వేల నుంచి 2 లక్షల జనాభా కలిగిన పట్టణాలు ఉన్నాయని ఈ పట్టణాలకు ఒక్కొ తహశీల్దార్ ఉంటారు. కానీ ఇంత ఇంత మందికి ఒకరే తహశీల్దార్ ఉండటం వల్ల ఇబ్బంది ఉన్న మాట వాస్తవం అన్నారు. రాబోయే రోజుల్లో ఈ విషయాన్ని కేబినెట్‍లో చర్చించి అదనంగా పట్టణప్రాంతాల్లో తహశీల్దార్లను కేటాయిస్తామని ప్రకటించారు. ఇవాళ పెద్దపల్లి జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన పొంగులేటి.. ఈ ప్రభుత్వం పేదలకు అనేక కార్యక్రమాలు చేస్తున్నందునే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్, సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు మద్దతుగా నిలిచారన్నారు. త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సమస్యలపై ఈ ప్రభుత్వం పాజిటివ్ గా స్పందిస్తుందని భరోసా ఇచ్చారు.
కేటీఆర్.. పగటి కలలు మానుకో:
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍పై ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‍లో ప్రజలు చిత్తుగా ఓడించాక కూడా మున్సిపల్ ఎన్నికల్లో గెలుస్తామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీదే విజయం అని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు వరుసగా బీఆర్ఎస్ ను ఓడించినా నిస్సిగ్గుగా మళ్లీ మున్సిపల్ ఎన్నికలను (Municipal Elections) సెమీ ఫైనల్ అని మాట్లాడుతున్నారని అసలు బీఆర్ఎస్ అడ్రస్ ఎక్కడుందని విమర్శించారు. ఇంట్లో చిచ్చును ఇంటి ఆడబిడ్డకు న్యాయం చేయని కేటీఆర్ రాష్ట్ర ప్రజలకు ఏం న్యాయం చేస్తాడని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా పగటి కలలు కంటూ అవాకులు చెవాకులు పేలుతున్నాడని మండిపడ్డారు. ఇకనైనా పగటి కలలు మానుకోవాలని హితవు పలికారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు ఇండ్లు ఇవ్వాలనే ఆలోచన చేయలేదన్నారు. ఇండ్లు కడితే కమిషన్లు రావని కమిషన్లు వచ్చే కాళేశ్వరం కట్టారని విమర్శించారు. ఈ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిందని, పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తోందన్నారు. కేటీఆర్ ది కాకిగోల, సీఎం సీటుపై తాపత్రయం తప్ప ఇంకేమి కాదన్నారు. గత బీఆర్ఎస్ పాలనకు ప్రస్తుతం ప్రజా పాలనకు నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.






