అందాల పోటీల వెనుక మంచి లక్ష్యం ఉంది: సోనూసూద్

by Ajay Maddhiboyina |

ఈ నెల 10వ తేదీ నుండి హైద‌రాబాద్‌లో అందాల పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. అందాల పోటీలకు అథితిగా నేడు బాలీవుడ్ నటుడు సోనూసూద్ విచ్చేశారు.

అందాల పోటీల వెనుక మంచి లక్ష్యం ఉంది: సోనూసూద్
X

దిశ‌, వెబ్ డెస్క్: ఈ నెల 10వ తేదీ నుండి హైద‌రాబాద్‌లో అందాల పోటీలు జరగనున్న సంగతి తెలిసిందే. అందాల పోటీలకు అథితిగా నేడు బాలీవుడ్ నటుడు సోనూసూద్ విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాలీవుడ్ సినిమాలు వదులుకుని తెలుగు సినిమాలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హైదరాబాద్ తో తనకు చక్కటి అనుబంధం ఉందని అన్నారు.

ఇవి కేవలం అందాల పోటీలు మాత్రమే కాదని అందాల పోటీల వెనుక మంచి లక్ష్యం దాగి ఉందని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీల కోసం అద్భుతంగా ఏర్పాట్లు చేసిందని తెలిపారు. విమానాశ్రయం నుండి హోటల్స్‌కు చేరుకునే వరకు ఏర్పాట్లు చేసిందని తెలిపారు. రాబోయే 25 రోజులు చాలా ముఖ్యమైనవని తెలంగాణ కంటే గొప్పగా అందాల పోటీలను ఎవరూ నిర్వహించలేరని కొనియాడారు. అంతే కాకుండా రొమ్ము క్యాన్సర్ శస్త్ర చికిత్సలను దేశవ్యాప్తంగా ఉచితంగా అందిస్తున్నామని, రొమ్ము క్యాన్సర్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు.

Next Story