- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Viral video: అమ్మ నిద్రలో ఉంటే.. పిల్లాడు చేసిన పనికి మెట్రోలో అందరి మనసు దోచుకున్నాడు!
మెట్రో రైలులో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఎక్కువగా ప్రయాణికులు మధ్య గొడవలు, ప్రేమ జంటల రొమాన్స్, మద్యం సేవించడం, పాటలు పాడటం, ఇన్‌స్టా రీల్స్ చేసే బ్యాచ్ లాంటి వారి వీడియోలు ఎక్కువగా చూసి ఉంటారు.

దిశ, డైనమిక్ బ్యూరో: (Viral video) మెట్రో రైలులో తరుచుగా రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులోనూ ఎక్కువగా ప్రయాణికులు మధ్య గొడవలు, ప్రేమ జంటల రొమాన్స్, మద్యం సేవించడం, పాటలు పాడటం, ఇన్‌స్టా రీల్స్ చేసే బ్యాచ్ లాంటి వారి వీడియోలు ఎక్కువగా చూసి ఉంటారు. తాజాగా (Kolkata Metro Rail) కోల్‌కతా మెట్రో రైలులో హార్ట్ టచింగ్ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమ్మ కోసం కొడుకు చేసిన పనికి నెటిజన్లు ఎమోషనల్ అయ్యారు. అమ్మ నిద్రలో ఉంటే.. కొడుకు ఇచ్చిన సపోర్ట్‌తో మెట్రోలో అందరి మనసు దోచుకున్నాడు.
కోల్‌కతా మెట్రోలో కనిపించే ఈ దృశ్యం నా హృదయాన్ని కదిలించిందని ఎక్స్ వేదికగా @Anwarali_0A అనే యూజర్ వీడియో పోస్ట్ చేశారు. వైరల్ వీడియో ప్రకారం.. మెట్రో రైలులో ఓ మహిళ తన పిల్లాడితో ప్రయాణిస్తోంది. ఆ మహిళ చాలా అలసిపోయి కనిపిస్తోంది. దీంతో ఆమె చిన్నగా నిద్రలోకి జారుకుంది. ఆ సమయంలో పక్కనే కూర్చుని ఉన్న తన కొడుకు నిద్ర మత్తులో ఉన్న తన అమ్మను చూసి కింద పడకుండా చేతులతో పట్టుకొని సపోర్ట్ ఇచ్చాడు. మరోవైపు మెట్రోలో సపోర్ట్ కోసం పట్టునే రాడ్ తన అమ్మ తలకు తగలకుండా చూసుకున్నాడు. దాదాపు 4 నిమిషాల నిడివిగల వీడియో లో పిల్లాడు తన అమ్మ నిద్రపోయినంత సేపు చాలా జాగ్రత్తగా అమ్మకు ఎలాంటి హాని కలగకుండా చూసుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవ్వడంతో నెటిజన్‌లు ఫిదా అయ్యారు. అమ్మ అంటే ఎవరికైనా ఇష్టమేనని, తల్లిదండ్రులు లోపం లేకుండా పెంచితే పిల్లలు ఇలా గుణవంతులు అవుతారని నెటిజన్‌లు కామెంట్స్ చేశారు.






