సోనియా బర్త్ డే.. రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్!

by Disha Web Desk 4 |
సోనియా బర్త్ డే.. రాష్ట్ర ప్రజలకు రేవంత్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్!
X

దిశ, వెబ్‌డెస్క్: డిసెంబర్ 9 సోనియా బర్త్ డే సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ గిఫ్ట్ అనౌన్స్ చేశారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధి రూ.10లక్షలకు పెంపు పథకాన్ని రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో ప్రారంభించారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలో సెకండ్ గ్యారంటీగా ఈ పథకాన్ని ప్రారంభించారు. మొదటి గ్యారంటీగా తెలంగాణలో మహాలక్ష్మీ ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభించారు. అసెంబ్లీ ఆవరణలో పథకాల ప్రారంభం సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యాంరటీల్లో రెండు హామీలను నేడు ప్రారంభిస్తున్నామన్నారు. డిసెంబర్ 9 రాష్ట్రానికి పండుగ రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

Next Story

Most Viewed