- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బ్రేకింగ్: ఎన్నికల వేళ తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ సంచలన సందేశం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి మరికొన్ని నిమిషాల్లో తెరపడనుంది. గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. బహిరంగా సభలు, రోడ్ షోలు,

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఘట్టానికి మరికొన్ని నిమిషాల్లో తెరపడనుంది. గెలుపే లక్ష్యంగా రాష్ట్రంలోని ప్రధాన పార్టీలన్నీ ప్రచారం హోరెత్తిస్తున్నాయి. బహిరంగా సభలు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు ఇలా.. అందిన వచ్చిన ప్రతిమార్గం గుండా ప్రజలకు చేరువ అయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ కీలక సందేశం ఇచ్చారు. ఆరోగ్య కారణాల రీత్యా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనలేకపోయిన సోనియా గాంధీ.. ఎన్నికలకు సరిగ్గా రెండు రోజుల ముందు వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ప్రజలకు కీలక విజ్ఙప్తి చేశారు.
‘‘ప్రియమైన సోదర సోదరీమణులారా నేను మీ దగ్గరకు రాలేకపోతున్న.. కానీ మీరు నా గుండెకు చాలా దగ్గరగా ఉంటారు. నేను ఈరోజు మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు పూర్తి అవడం చూడాలనుకుంటున్న.. దొరల తెలంగాణని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ప్రజల తెలంగాణగా మనమందరం కలిసి మార్చాలి. మీ కలలు సాకారం అవ్వాలి.. మీకు మంచి ప్రభుత్వం లభించాలి. నన్ను సోనియమ్మ అని పిలిచి నాకు చాలా గౌరవం ఇచ్చారు.. ఈ ప్రేమ, అభిమానాలకు నేను ఎప్పటికి మీకు రుణపడి ఉంటాను. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు నా విన్నపం.. మార్పు కోసం కాంగ్రెస్‌కి ఓటేయండి.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’’ అని వీడియో ద్వారా సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ ప్రజలకు సందేశమిచ్చారు.
కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సోనియా గాంధీతో ఫినిషింగ్ టచ్ ఇప్పించాలని టీ- కాంగ్రెస్ నేతలు భావించారు. కానీ పలు కారణాల రీత్యా సోనియా గాంధీ ప్రచారానికి రాలేకపోయారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా గాంధీతో వీడియో ద్వారా రాష్ట్ర ప్రజలకు సందేశం ఇప్పించారు స్టేట్ కాంగ్రెస్ లీడర్స్. తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియాకు గుర్తింపు ఉండటంతో ఆమె ఇచ్చిన సందేశం ఎన్నికల వేళ తమకు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది.






