- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సోనియా గాంధీ లేఖ
తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై సోనియా గాంధీ లేఖ

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మిర్ఖాన్‌పేటలో డిసెంబర్ 8, 9వ తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్(Telangana Global Summit) నిర్వహిస్తున్నది. ఈ సమ్మిట్‌ను దావోస్ సమ్మిట్ తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్వహించాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. ఈ సదస్సు ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకోవాలని, భవిష్యత్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా 500 కంటే ఎక్కువ పెద్ద కంపెనీలు, 2000 పైగా వ్యాపారవేత్తలు, నాయకులు, నిపుణులు ఈ సదస్సుకు హాజరవుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌పై కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ(Sonia Gandhi) స్పందించారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందిస్తూ లేఖ రాశారు. ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా తెలంగాణ మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేసింది. లక్ష్యానికి ఈ సమ్మిట్ దోహదపడుతుందని పేర్కొంది. మూడంచెల వ్యూహంతో తెలంగాణ ముందుకు సాగుతోందని సోనియా స్పష్టం చేసింది.






