Bandi Sanjay : సోనియా గాంధీ రూ.2 వేల కోట్లు కాజేసే ప్రయత్నం చేసింది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

by Muthe.Rajitha |

బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay : సోనియా గాంధీ రూ.2 వేల కోట్లు కాజేసే ప్రయత్నం చేసింది : బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : బీజేపీ కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ(Sonia Gandhi)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు రూ.2 వేల కోట్ల ప్రభుత్వ సంపదను కాజేసే ప్రయత్నం చేసారంటూ హాట్ కామెంట్స్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసు(National Herald Case)లో కాంగ్రెస్ దేశ సంపదను దోచుకునేందుకు సిద్ధం అయిందన్నారు. ఈ కేసు బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటిది కాదని, 2011లో యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సీబీఐ(CBI) దర్యాప్తు మొదలైందని గుర్తు చేశారు. ఆ సమయంలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ కేసులో బెయిల్ పొందారని తెలిపారు.

ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని బండి సంజయ్ పేర్కొన్నారు. ఈ దేశ చట్టాలు సోనియాకు, రాహుల్ కు వర్తించవా అని ఆయన ప్రశ్నించారు. తప్పు చేసిన వారు బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని.. న్యాయస్థానాలపై ప్రజలకు నమ్మకం ఉండటం లేదని వెల్లడించారు. ఇటీవల నేషనల్ హెరాల్డ్ కేసుపై కాంగ్రెస్ నేతలు ధర్నా నిర్వహించిన సనాటి తెలిసిందే. ఈ ధర్నాపై బండి సంజయ్ స్పందిస్తూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.

Next Story