సోనియా ప్రధాని పదవిని త్యాగం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి

by Naga Rani Yarlagadda |

గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమేనని, కరీంనగర్లో సోనియాగాంధీ (Sonia Gandhi) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు.

సోనియా ప్రధాని పదవిని త్యాగం చేశారు : సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్:గాంధీ కుటుంబం మాట ఇస్తే అది శిలా శాసనమేనని, కరీంనగర్లో సోనియాగాంధీ (Sonia Gandhi) ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. సోమవారం రవీంద్రభారతి (Ravindra Bharati)లో జరిగిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత సర్వాయి పాపన్నకు నివాళులు అర్పించారు. అనంతరం విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన చేసి మాట్లాడుతూ.. ప్రపంచంలోనే ఇండియా మొదటి స్థానంలో ఉండాలని సోనియాగాంధీ ప్రధానమంత్రి పదవినే త్యాగం చేశారన్నారు.

రాష్ట్రంలో కులగణన (Caste Census)కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా దానిని పూర్తి చేశామని, దేశంలో ఎక్కడా జరగని విధంగా కులగణన చేసి చూపించామన్నారు. ఇందులో ఎలాంటి తప్పులు దొర్లకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని, ఎందరో మేథావులతో కూడా చర్చించామని చెప్పారు. సెప్టెంబరు 30 లోగా రాష్ట్రంలో ఎన్నికలు జరగాలంటే రాజ్ భవన్లో పెండింగ్ లో ఉందని, రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్న ఆ బిల్లు కోసం ఢిల్లీకి వెళ్లి ధర్నా చేశామన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదు? రిజర్వేషన్ బిల్లుకు అడుపడుతోన్నది ప్రధాని మోదీ, మంత్రి కిషన్ రెడ్డి కాదా ? అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. గుజరాత్ లో ముస్లింలకు వచ్చే బీసీ రిజర్వేషన్లను తొలగించగలరా ? అని సూటిగా ప్రశ్నించారు.

ఇక రాష్ట్రంలో 56.33 శాతం బలహీన వర్గాల ప్రజలు ఉన్నారని, బలహీన వర్గాలు బలపడాలంటే ప్రతి ఒక్కరూ చదువుకోవాలని సీఎం సూచించారు. బహుజనులు నిలదొక్కుకుంటేనే సమాజంలో సమూల మార్పు వస్తుందన్నారు. అందుకే యంగ్ ఇండియా స్కూల్స్ ను తీసుకొచ్చినట్లు తెలిపారు. తమకు బీసీల నైతిక మద్దతు ఉంటే రిజర్వేషన్ల కోసం ఎంత వరకైనా వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం తెలిపారు. రాహుల్‌ చెప్పినట్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. రిజర్వేషన్లు 50 శాతం మించవద్దని కేసీఆర్‌ తెచ్చిన చట్టాన్ని తొలగించడానికి ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామని తెలిపారు.

దొంగ ఓట్లపై మాట్లాడుతూ.. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మహారాష్ట్రలో నాలుగు నెలల్లో కోటికిపైగా కొత్త ఓట్లు పుట్టుకొచ్చాయని విమర్శించారు. కొత్తగా వచ్చిన ఓట్లతోనే బీజీపీ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. బిహార్ లోనూ అధికారంలోకి రావాలన్న దురాలోచనతో ఉన్నపళంగా 65 లక్షల ఓట్లను తొలగించేశారని ఆరోపించారు. మహారాష్ట్రలో జరిగిందే రిపీట్ అవ్వకుండా ఉండాలనే దొంగ ఓట్లపై రాహుల్ గాంధీ న్యాయపోరాటం చేస్తున్నారన్నారు.

Next Story