పాట.. పోరాటానికి బాట : దౌర్జన్యాలు, నిర్భందాల నుంచే కళారూపాలు

by Naga Rani Yarlagadda |

దేశం కులాలు, మతాలుగా వీడిపోతున్నఈ తరుణంలో సమసమాజమే స్థాపన లక్షంగా ఆవిర్భావించిన ప్రజా నాట్యమండలి కళాకారులంతా ఢిల్లీ పీఠం అదిరిపడేలా ఆట పాటలు, డప్పుదరువుతో మళ్లీ ప్రజల్లో చైతన్యం నింపాలని, తద్వారా ఈ దేశాన్నికాపాకుందామని పలువురు కళాకారులు, సినీ రంగ ప్రముఖులు పిలుపునిచ్చారు.

పాట.. పోరాటానికి బాట : దౌర్జన్యాలు, నిర్భందాల నుంచే కళారూపాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశం కులాలు, మతాలుగా వీడిపోతున్నఈ తరుణంలో సమసమాజమే స్థాపన లక్షంగా ఆవిర్భావించిన ప్రజా నాట్యమండలి కళాకారులంతా ఢిల్లీ పీఠం అదిరిపడేలా ఆట పాటలు, డప్పుదరువుతో మళ్లీ ప్రజల్లో చైతన్యం నింపాలని, తద్వారా ఈ దేశాన్నికాపాకుందామని పలువురు కళాకారులు, సినీ రంగ ప్రముఖులు పిలుపునిచ్చారు. ప్రజల సమస్యలనే కళా రూపాలుగా మలిచి గొంతేత్తి నినదించిన నిత్య చైతన్య స్ఫూర్తి తెలంగాణ ప్రజా నాట్యమండలి అని వారు ప్రశంసించారు. తెలంగాణ ప్రజానాట్యమండలి రాష్ట్ర 4వ మహాసభలు హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఈ మహాసభలను సోమవారం నారాయణగూడలోని మార్వెల్ పంక్షన్ సినీ నిర్మాత, దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ తెలంగాణ ప్రజానాట్యమండలి పతాకాన్ని ఆవిష్కరించి మహాసభలను ప్రారంభించారు. మహాసభల ఆహ్వానం సంఘం ప్రధాన కార్యదర్శి పల్లె నర్సింహా అధ్యక్షతన జరిగిన బహిరంగసభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎంఎల్ఏ కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మొదలు కుల వివక్షత, వెట్టిచాకిరి, భూస్వాముల దురాగతాలు, దౌర్జన్యాలు ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నాయకుడి కంటే ముందు కళా కారుడి గొంతు వెళ్లి నిలబడిందన్నారు. ఎక్కడ ఇబ్బందులు జరిగిన వాటిలో నుంచే కళా రూపాలను సృష్టించి పాటల రూపంలో ఎండగడుతూ వస్తోందని తెలిపారు.

ఇండియన్ పీపుల్స్ ధియేటర్ అసోసియేషన్ (ఇప్టా)పై నిషేధం విధించిన క్రమంలో తమ గొంతులను ఇతర వేదికల ద్వారా వినిపించేందుకు అనేక మంది ప్రజానాట్యమండలి కళాకారులు సీని రంగం వైపు వెళ్లి అందులో రాణించారని గుర్తు చేశారు. అంత గొప్ప చరిత్ర గలిగిన ప్రజానాట్యమండలి కళాకారులంతా అణగారిన ప్రజల సమస్యలపై కళా రూపాలతో గొంతేత్తి నినాదించాలని సూచించారు. మనిషి పుట్టుక నాటి నుంచే కళలు ఉన్నాయని, కానీ వాటికి ఓ రూపం ఇచ్చి ప్రజా కళలుగా మార్చింది ప్రజానాట్యమండలి అన్నారు. ఎప్పటికప్పుడు ప్రజల భావాలకు కళా రూపం అందించి వారి గొంతుకగా మారిందన్నారు. ఆట, పాట, డప్పు, దరవు, జానపధం ప్రతి కళకు రూపమించింది ప్రజానాట్యమండలేనని, రాష్ట్రంలో పుట్టిన ప్రతి సంస్కాతిక, కళా సంస్థలకు మాతృక ప్రజానాట్యమండలేనని గుర్తు చేశారు. సాంస్కృతిక పరంగా కళలు ఎన్ని రూపాల్లో ఉన్నా అంతిమంగా మనిషికి మంచి జరగాలన్న గొప్ప లక్షం ప్రజానాట్యమండలిదన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ దేశంలో ఇప్టా దానికి అనుబంధంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజా నాట్యమండలి ఒక గొప్ప ఆశయంతో పుట్టిన సంస్థలన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య భూమిక పోషించిన తెలంగాణ ప్రజానాట్యమండలి ఈ ప్రాంత విముక్తికి వెన్నదన్నుగా నిలిచిందన్నారు. సమస్యలను ఎవరో ఒక్కరూ పరిష్కరిస్తునే ఉంటారని, కానీ సమస్యలే లేకుండా అధికారం చేపట్టేందుకు మహాత్తర శక్తి, ధైర్యం ఉన్న సంస్థ ప్రజా నాట్యమండలి కళాకారులుగా సమ సమాజ స్థాపన అశయంతో ముందుకు సాగాలని సూచించారు.

ఆకట్టుకున్న తెలంగాణ ప్రజానాట్యమండలి కళా ప్రదర్శన

తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారుల కళా ప్రదర్శనతో రాష్ట్ర రాజధాని కేంద్రమైన హైదరాబాద్ దద్దరిల్లింది. కళాకారుల వివిధ ప్రదర్శనలు నగరవాసులను ఆకట్టుకున్నాయి. ‘ప్రజా కళాకారులం’ అని డబ్బు దరువుల మధ్య ఆట పాటలతో ముందుకు సాగారు. కళా ప్రదర్శనలో భాగంగా నగర ప్రజలకు తెలియని అనేక కళారూపాలను తెలంగాణ ప్రజానాట్యమండలి కళాకారులు పరిచయం చేశారు. తెలంగాణ ప్రజానాట్యమండలి 4వ రాష్ట్రమహాసభల సందర్భంగా సోమవారం హిమాయత్ నగర్, ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయం నుంచి నారాయణగూడలోని మార్వెల్ ఫంక్షన్ హాల్ వరకు కళా ప్రదర్శనను నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన కోలాట నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒగ్గు కళాకారులు, యాక్షగానం, బుర్రకధ, వీధి బాగోతాల కళా బృందాలు తమ కళా ప్రదర్శనలతో నగరవాసులను ఆలరించారు. రెండు కిలో మీటర్ల మేరకు సాగిన కళా ప్రదర్శనను ప్రయాణికులు రోడ్డుకు ఇరువైపుల బారులు తీరి మరి తిలకించారు.

Next Story