- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Son of ex-MLA: ప్రియురాలి కోరికలు.. చైన్ స్నాచర్‌గా మారిన మాజీ ఎమ్మెల్యే కొడుకు
ప్రియురాలి కోరికలు నెరవేర్చడానికి మాజీ ఎమ్మెల్యే కొడుకు చైన్ స్నాచర్‌గా మారిన ఘటన కలకలం సృష్టించింది.

దశ, డైనమిక్ బ్యూరో: ప్రియురాలి కోరికలు నెరవేర్చడానికి (Son of ex-Madhya Pradesh MLA) మాజీ ఎమ్మెల్యే కొడుకు చైన్ స్నాచర్‌గా మారిన ఘటన కలకలం సృష్టించింది. 65 ఏళ్ల వృద్ధురాలి నుంచి బంగారు గొలుసు లాక్కున్న (Madhya Pradesh’) మధ్యప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రవత్ (Vijendra Singh Chandrawat) కుమారుడు ప్రద్యుమన్ సింగ్‌ను (Ahmedabad police) అహ్మదాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. జనవరి 25న ఓ వృద్దురాలు ఆలయం నుండి తిరిగి వస్తుండగా, ఒక దుండగుడు ఆమె వద్ద ఉన్న రూ 1.25 లక్షల విలువైన బంగారు మంగళసూత్రాన్ని లాక్కొని పారిపోయాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోని గొలుసు కొట్టేసిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.
దాదాపు 250కి పైగా సీసీటీవీ క్లిప్‌లను పరిశీలించిన పోలీసులు 25 ఏళ్ల (Pradyuman) ప్రద్యుమన్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు అతని వివరాలు కనుకునే సరికి కంగుతిన్నారు. మాజీ ఎమ్మెల్యే విజేంద్ర సింగ్ చంద్రావత్ కుమారుడుగా దర్యాప్తులో తేలింది. అతను తన తల్లిదండ్రుల ఇంటిని వదిలి అహ్మదాబాద్‌కు వెళ్లి అక్కడ నెలకు రూ. 15 వేల జీతంతో ఉద్యోగం చేస్తున్నాడని, తన ఖర్చుల కోసం చోరీలకు ప్లాన్ చేసినట్లు అధికారులు గుర్తించారు.
అయితే, తన ప్రియురాలి కోరికలను నెరవేర్చడానికి తన ఆదాయం సరిపోదని, అందుకే సులభంగా డబ్బు సంపాదించడానికి చైన్ స్నాచింగ్‌లకు పాల్పడ్డాడని, ఇది అతని మొదటి నేరమని ఒక అధికారి తెలిపారు. ఇక దొంగిలించిన బంగారు మంగళసూత్రాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ప్రద్యుమన్‌పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కాగా, అతను చైన్ స్నాచింగ్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






