సచివాలయంలో సోమేశ్ చాంబర్ @ 6వ ఫ్లోర్.. ఎవరికీ కేటాయించకుండా ముందే రిజర్వ్

by Disha Web Desk 12 |
సచివాలయంలో సోమేశ్ చాంబర్ @ 6వ ఫ్లోర్.. ఎవరికీ కేటాయించకుండా ముందే రిజర్వ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రికి ముఖ్య సలహాదారుగా నియమితులైన మాజీ ఐఏఎస్ అధికారి సోమేశ్ కుమార్ త్వరలో కొత్త సచివాలయంలోని ఆరో అంతస్తులో కొలువుదీరనున్నారు. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయ కార్యదర్శులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు తదితరులకు మాత్రమే ఆరో అంతస్తులో చాంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ముఖ్యమంత్రికి చీఫ్ అడ్వయిజర్‌‌గా నియమితులైన సోమేశ్ కుమార్‌కు కూడా అక్కడే ఒక ఛాంబర్ అలాట్ అయింది. గత నెల 30న సెక్రటేరియట్‌కు ప్రారంభోత్సవం జరిగినప్పుడే ఆరో అంతస్తులో ఒక ఛాంబర్‌ను ఎవరికీ కేటాయించకుండా రిజర్వులో ఉంచడం ఐఏఎస్ అధికారుల్లో చర్చకు దారితీసింది. దీన్ని ఎవరి కోసం ఉంచారనే గుసగుసలు వినిపించాయి.

సోమేశ్ కుమార్‌కు త్వరలో కొత్త బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు ముఖ్యమంత్రి డిసైడ్ అయినందునే ఆయన కోసం ఒక ఛాంబర్‌ను హోల్డ్‌లో పెట్టారనే అనుమానానికి తాజా నియామక ఉత్తర్వులతో బలం చేకూరినట్లయింది. ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయానికి వచ్చినా రాకున్నా ప్రగతి భవన్ నుంచి అందే ఆదేశాల మేరకు సోమేశ్ కుమార్ సచివాలయం నుంచి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అన్ని శాఖల మీద సోమేశ్ ముద్ర కనిపిస్తుందని, రోజువారీ వ్యవహారాల్లోనూ ఆయన జోక్యం ఉండొచ్చన్న అనుమానాన్ని ఐఏఎస్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆబ్సెన్స్‌లో సోమేశ్ కుమార్ అన్నీ తానై వ్యవహరిస్తారని, అందువల్లనే ఆరో అంతస్తులో ఆయన కోసం ఛాంబర్‌ను ముందుచూపుతోనే రిజర్వు చేసి ఉంచడాన్ని ఉదహరిస్తున్నారు.

Also Read...

యూకే పర్యటనకు బయలుదేరిన కేటీఆర్

Next Story

Most Viewed