ఆదాయం సమపార్జించే శాఖల ఉద్యోగుల బదిలీలు

by Ajay Maddhiboyina |

రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం సమపార్జించే శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. మూడు శాఖలు వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్​ శాఖ, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్​లలో ఉద్యోగులను బదిలీ చేయడానికి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఆదాయం సమపార్జించే శాఖల ఉద్యోగుల బదిలీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ప్రభుత్వానికి ఆదాయం సమపార్జించే శాఖల్లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చింది. మూడు శాఖలు వాణిజ్య పన్నుల శాఖ, ఎక్సైజ్​ శాఖ, స్టాంప్స్​ అండ్​ రిజిస్ట్రేషన్​లలో ఉద్యోగులను బదిలీ చేయడానికి అనుమతి ఇస్తూ ఆర్థికశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వేసవిలో ఉద్యోగుల సాధారణ బదిలీలు ఉంటాయని, బదిలీ చేపట్టాలని ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేశాయి. అయితే వివిధ కారణాలతో బదిలీలు సాధ్యం కాలేదు.

ఈ నేపథ్యంలో కనీసం ఆదాయం సమపార్జించే శాఖల్లో అయిన బదిలీలు చేపట్టాలని నిర్ణయించారు. ఆదాయం సమపార్జించే శాఖల్లో ప్రతి రెండు సంవత్సరాలకు ఒక సారి ఉద్యోగులను బదిలీ చేస్తుంటారు. దీని ద్వారా పారదర్శకత, ఒకే చోట ఉద్యోగులు పాతుకపోకుండా ఉండటం తదితర కారణాలతో బదలిలు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో బదిలీలకు ఆర్థిక శాఖ గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చినట్లుగా తెలిసింది. వీరికి సంబంధించిన బదిలీల మార్గదర్శకాలు త్వరలో జారీకానున్నాయి. ఆయా శాఖలు వేరు వేరుగా మార్గదర్శకాలు, షెడ్యూల్​ను విడుదల చేయనున్నట్లుగా సమాచారం.

Next Story