ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి.. మంత్రి పొంగులేటిని కోరిన ఉద్యోగ నేతలు

by Bhoopathi Nagaiah |

రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి పొంగులేటిని ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు.

ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి.. మంత్రి పొంగులేటిని కోరిన ఉద్యోగ నేతలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని డిప్యూటీ కలెక్టర్స్ అసోసియేషన్, తెలంగాణ తహశీల్దార్స్ అసోసియేషన్, తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నేతలు కోరారు. సోమవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీసీఎల్ఏకు విచ్చేసి రెవెన్యూ ఉన్నతాధికారులతో శాఖాపరమైన సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీఎల్ఏ లోకేష్ కుమార్ సమక్షంలో తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి.లచ్చిరెడ్డి నేతృత్వంలో మంత్రిని కలిశారు. రెవెన్యూ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ప్రతి సమస్యను పరిష్కరించేందుకు కృషి చేయనున్నట్లుగా మంత్రి హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన వారిలో టీజీటీఏ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.రాములు, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు బాణాల రాంరెడ్డి, టీజీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ పాక, సెక్రటరీ జనరల్ పూల్ సింగ్ చౌహాన్, టీజీఆర్ఎస్ఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.భిక్షం, కోశాధికారి మల్లేష్ ఉన్నారు.

Next Story