- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రైతులతో సోలార్ ఉత్పత్తి
రాష్ట్రంలో సోలార్విద్యుత్ఉత్పత్తికి వడి వడిగా అడుగులు పడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి వచ్చిన అధికారులు తెలంగాణలోనూ సాగుకు పనికి రాని భూములను సోలార్విద్యుత్ఉత్పత్తికి వినియోగింపజేయడం

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో సోలార్విద్యుత్ఉత్పత్తికి వడి వడిగా అడుగులు పడుతున్నాయి. దేశంలోని పలు రాష్ట్రాల్లో క్షేత్ర స్థాయిలో పరిశీలించి వచ్చిన అధికారులు తెలంగాణలోనూ సాగుకు పనికి రాని భూములను సోలార్విద్యుత్ఉత్పత్తికి వినియోగింపజేయడం ద్వారా రైతులకు ఆదాయం ఇప్పించడంతో పాటు ఇటు రాష్టానికి ఉపకరించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న పీఎం కుసుం స్కీమ్‌ను మరింతగా వినియోగించుకోవాలని భావిస్తోన్న సర్కారు..రైతులకు సోలార్విద్యుత్ ఉత్పత్తికి అవకాశాలు ఇవ్వనుంది. ఈ స్కీం కింద తెలంగాణలో 1450 మెగావాట్ల సోలార్విద్యుత్చేయాలని కేంద్రం సూచించగా, తెలంగాణ రాష్ట్రం మరో అడుగు ముందుకేస్తూ 1550 మెగావాట్ల సోలార్విద్యుత్ను ఉత్పత్తి చేయించి చూపిస్తామని మాట ఇచ్చింది. ఈ స్కీమ్ టార్కెట్‌ను కేంద్రం ఈ ఏడాది డిసెంబర్31 వరకు విధించగా, అందుకు అనుగుణంగానే రాష్ట్రం రైతుల్లో ప్రేరణ తీసుకొస్తోంది.
పీఎం కుసుం కాంపోనెంట్– ఏ కు ప్రాధాన్యత
పీఎం కుసుం పథకంలో కాంపోనెంట్-ఏ,బీ,సీలు భాగాలుగా ఉన్నాయి. ఇందులో కాంపోనెంట్– ఏ కు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతను ఇస్తోంది. కాంపోనెంట్ఏ కింద వ్యవసాయ భూములపై 500 కిలోవాట్ల నుంచి రెండు మెగావాట్ల సామర్థ్యం గల సౌర లేదా ఇతర పునరుత్పాదక ఇంధన ఆధారిత విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తారు. సౌర ప్లాంట్లు సోలార్ ప్యానెల్‌లను అమర్చేందుకు ఎత్తైన నిర్మాణం అవసరం ఉంటుంది. కాగా వ్యవసాయ కార్యకలాపాలకు ప్రభావితం కాకుండా ఉండేలా ఈ సోలార్‌ప్యానెల్ వరుసలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ పథకం కింద వ్యవసాయానికి అంతగా పనికి రాని భూములతో పాటు సాగు భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకొస్తే వాటిని సైతం అనుమతిస్తారు. వ్యవసాయ భూమిలో సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం ద్వారా రైతులు అదనపు విద్యుత్తు ఉత్పత్తి చేసి, దానిని పంపిణీ సంస్థలకు విక్రయించుకునే సదుపాయం కల్పించనున్నారు.
డబ్బులు లేకుంటే ప్రయివేటుకు ఇచ్చుకోవచ్చు
ఒక్కో రైతుకు 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్పవర్ప్లాంట్పెట్టుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడ్కో సంస్థ ద్వారా అవకాశం కల్పిస్తోంది. ఒక మెగావాట్సోలార్విద్యుత్ఉత్పత్తికి రూ.3 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. రైతులకు రెండు మెగావాట్ల వరకు సోలార్పవర్ఉత్పత్తికి అవకాశం ఇచ్చిన నేపథ్యంలో రూ.6 కోట్ల వరకు వ్యయం చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు రైతులకు సరిపడా డబ్బులు ఉంటేనే సొంతంగా పెట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. పైగా ఇందుకు బ్యాంకులు కూడా ఆర్థికంగా సహకరించేలా టీజీ రెడ్కో భరోసా ఇస్తోంది. ఇలా ఒక్కో రైతుకు బ్యాంకుల్లో 70 నుంచి 90 శాతం వరకు రుణాలు ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. రుణాలిచ్చేందుకు బ్యాంకుల విధి విధానాలను పాటిస్తారు. రైతాంగం కూడా 10 శాతానికే పరిమితం కాకుండా 10 నుంచి 30 శాతం వరకు డబ్బులు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉండాలని సూచిస్తారు. తమ భూముల్లో సోలార్విద్యుత్ఉత్పత్తి చేయించుకోవాలన్న ఆసక్తి ఉన్నా మరి కొందరికి మాత్రం సరిపడా ఆర్థిక వనరులు లేక ఇబ్బందులు పడుతుంటారు. ఇలాంటి రైతులు ప్రయివేటు సంస్థలకు చెందిన డెవలపర్లను తమ భూముల్లోకి ఆహ్వానించే సదుపాయాన్ని కల్పిస్తున్నారు. భూములను లీజుకు ఇచ్చేందుకు కనీసం 25 సంవత్సరాల వరకు ఆయా డెవలపర్లు అడుగుతున్న ఉదంతాలు తెలంగాణలో ఉన్నాయి. దీంతో రైతాంగాన్ని ఇబ్బందుల పాలు చేసే అవకాశం ఉంటుంది గనుక విద్యుత్డిస్కంలు రంగంలోకి దిగుతున్నాయి. ఆయా భూముల్లో ఉత్పత్తి అవుతున్న సోలార్విద్యుత్ను డిస్కంలకే ఇవ్వాలని నిబంధన పెట్టడంతో పాటు ఈ విద్యుత్ఉత్పత్తికి అవకాశం ఇస్తున్నందుకు రైతులకు 25 సంవత్సరాల వరకు నికర ఆదాయం తప్పకుండా అందేలా చర్యలు తీసుకుంటోంది. ఇలా సోలార్పవర్ఉత్పత్తి చేయడం, లేదా చేయించడం ద్వారా రైతులు లబ్ధి పొందుతున్నారు.
400 మెగావాట్ల ఉత్పత్తికి ముందుకు
రాష్ట్రంలో ఇప్పటి వరకు 400 మెగావాట్ల సోలార్విద్యుత్ఉత్పత్తికి రైతులు ముందుకొచ్చారు. ఈ మేరకు 300 మందికి పైగా రైతులు డిస్కంల వద్ద పవర్పర్చేజ్అగ్రిమెంట్లను చేసుకోవడం విశేషం. కేంద్ర ప్రభుత్వం 1,450 మెగావాట్ల వరకు ఉత్పత్తి చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో రెడ్కో సహకారంతో రైతులు సోలార్విద్యుత్ఉత్పత్తి చేసుకునేలా చూస్తున్నామని, మరో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తికి అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని అభ్యర్థించింది. ఇందుకు ఎల్‌వోసీ (లెటర్ఆఫ్అవార్డ్స్) కూడా అందజేసింది. ఈ విధంగా 1550 మెగావాట్లకు గాను 400 మెగావాట్ల సోలార్విద్యుత్ఉత్పత్తి చేసుకునేలా రైతులకు పీపీఏ అగ్రిమెంట్లు ఇవ్వడం గమనార్హం. కాగా ఈ ఏడాది డిసెంబర్31లోగా అన్ని రకాల అనుమతులు తీసుకుని సోలార్విద్యుత్ఉత్పత్తి ప్రారంభించేలా తుది గడువు విధించడంతో ఆ దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి.






