అప్పుచెల్లించాలని వేధింపులతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..

by Elthuri vijay kumar |   (  Updated:2025-09-15 17:03:26  IST  )

తీసుకున్న అప్పు చెల్లించాలని వేధించడంతో తల్లాడ మండలం నరసింహారావుపేట గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిన్ని ప్రశాంత్ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అప్పుచెల్లించాలని వేధింపులతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..
X

అప్పుచెల్లించాలని వేధింపులతో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఆత్మహత్య..

దిశ,తల్లాడ: తీసుకున్న అప్పు చెల్లించాలని వేధించడంతో తల్లాడ మండలం నరసింహారావుపేట గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పిన్ని ప్రశాంత్ (27) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈమేరకు సోమవారం తల్లాడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.వివరాలిలా ఉన్నాయి.. హైదరాబాద్ లో ప్రశాంత్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. హైదరాబాద్ కు చెందిన మల్లిఖార్జున్, సుధీర్ కుమార్, రంజిత్ కుమార్ వద్ద ప్రశాంత్ రూ.26 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. తాము ఇచ్చిన అప్పు చెల్లించాలని ప్రశాంత్ ను ముగ్గురు వేధించడంతో హైదరాబాద్ నుంచి స్వస్థలమైన నరసింహారావుపేట వచ్చాడు. ఈనెల 13l రాత్రి ప్రశాంత్ ఇంటి వద్దనే పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రశాంత్ ను చికిత్స కోసం ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి ప్రశాంత్ మృతి చెందాడు. తండ్రి పిన్ని శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు తల్లాడ ఎస్సై ఎన్.వెంకటకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story