- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కామారెడ్డి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు.. దుమారం సృష్టిస్తున్న మెసేజ్?
కామారెడ్డి నియోజకవర్గ రాజకీయంలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండేది ఎవరు అనే దానిపై బెట్టింగులు కాస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది.

దిశ, కామారెడ్డి: కామారెడ్డి నియోజకవర్గ రాజకీయంలో నెక్స్ట్ ఎమ్మెల్యే ఎవరు అనే చర్చ జరుగుతోంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో ఉండేది ఎవరు అనే దానిపై బెట్టింగులు కాస్తున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఓ జిల్లా స్థాయి నేతకు మరొక నేత భారీ గిఫ్ట్ కూడా ఇచ్చినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దాంతో అసలు కామారెడ్డిలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది.
ఎన్నికలు ముగిసి ఏడాది గడిచిపోయింది. రెండవ ఏడాదిలో పనులు కొనసాగించి నియోజకవర్గంలో పట్టు సాధించేలా ప్రయత్నాలు ఓ వైపు జరుగుతుండగా.. భవిష్యత్తుకు పునాది వేసుకునేందుకు తెరవెనుక రహస్య మంతనాలు జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. దాని కోసం ఇప్పటికే పార్టీలో మంట పెట్టినట్టుగా ప్రచారం సాగింది. జిల్లా స్థాయి ఓ నాయకునికి ఖరీదైన కారు, వాచ్ గిఫ్ట్ గా ఇచ్చినట్టుగా ప్రచారం సాగుతోంది. 2029 లో ఎమ్మెల్యేగా పోటీ కోసం ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ చేసుకోవడానికి సన్నద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది.
సుమారు ఆరు నెలల క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తీవ్ర చర్చకు దారి తీసింది. ఆ పోస్ట్ నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా తీవ్ర దుమారం కూడా రేపింది. పేరు తెలియకుండా సోషల్ మీడియాలో 'రాబోయే రోజుల్లో మన కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా ఎవరు పోటీ చేయబోతున్నారు' అని దాని కింద చందు గారు.. కైలాస్ గారు.. ఇలియాస్ గారు.. డమ్మీ గాళ్లా అంటూ అప్షన్స్ తో ఓ పోస్ట్ పెట్టారు.
ఈ పోస్ట్ పై పట్టణ నాయకుడు ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మెసేజ్ పెట్టిన వాడు ఎవడు.. డమ్మీ అనేది ఎవడ్రా.. నీకు పార్టీతో ఏదైనా సంబంధం ఉందా..ముందు నువ్వెవడో చెప్పి పోస్టు చెయ్ బిడ్డా.. నెక్ట్స్ పోటీ చేసేది షబ్బీర్ అలీ లేదా ఇలియాస్ లేదా పార్టీని పట్టుకుని సీనియర్లు ఎంతోమంది ఉన్నారు. నిన్న మొన్న వచ్చిన వాళ్ళ పేరు పెట్టి సీనియర్ నాయకులను తప్పుదారి పట్టిస్తే బట్టలు ఊడదీసి కొడతా బిడ్డా. నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏదో ఆశ చూపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇన్ని సంవత్సరాల పాటు సేవలందించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉరికించి కొడతారు బిడ్డా. అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఏదో ఆశ చూపిస్తే అనే మాట పెద్ద చర్చకు దారి తీసింది. ఇన్ డైరెక్టుగా జిల్లా స్థాయి నాయకునికి ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారన్న వాదన ఈ హెచ్చరిక బట్టబయలైంది. కొద్దిరోజుల పాటు ఈ చర్చ కొనసాగినా మళ్ళీ ఈ చర్చ మొదలైనట్టుగా తెలుస్తోంది. భవిష్యత్తుకు పునాది వేసుకునేందుకు సదరు నేతకు గాలం వేసినట్టుగా తెలుస్తోంది. ఇంతకు ఖరీదైన గిఫ్ట్ తీసుకున్నది ఎవరు..? ఇచ్చిందెవరు అనే చర్చ నియోజకవర్గంలో ప్రస్తుతం చర్చ జోరుగా సాగుతోంది. ఈ చర్చ ఇలాగే కొసాగుతోందా.. ముఖ్య నాయకులు ఈ చర్చకు పుల్ స్టాప్ పెడతారా అనేది తెలియాల్సి ఉంది.






