Bandi Sanjay : సామాజిక న్యాయ భేరి కాదు.. సామాజిక అన్యాయ భేరి

by Muthe.Rajitha |   (  Updated:2025-07-04 15:38:54  IST  )

హైదరాబాద్‌(Hyderabad)లో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ(Congress Samarabheri Sabha) జరిగిన సంగతి తెలిసిందే.

Bandi Sanjay : సామాజిక న్యాయ భేరి కాదు.. సామాజిక అన్యాయ భేరి
X

దిశ, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌(Hyderabad)లో ఎల్బీ స్టేడియం(LB Stadium)లో శుక్రవారం జరిగిన కాంగ్రెస్ సామాజిక న్యాయ సమర భేరి సభ(Congress Samarabheri Sabha) జరిగిన సంగతి తెలిసిందే. ఈ సభకు ముఖ్య అతిధిగా ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే హాజరవగా.. సీఎం రేవంత్ రెడ్డి సహ రాష్ట్ర అధినాయకత్వం, మంత్రులు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. "జై బాపు, జై భీమ్, జై సంవిధాన్" అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమంలో సామాజిక న్యాయం, రాజ్యాంగ రక్షణ, మరియు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమంపై దృష్టి సారించినట్లు కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. అయితే, ఈ సభపై బీజేపీ నాయకుడు, కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay) తీవ్ర విమర్శలు చేశారు.

ఈ సభ పేరును 'సామాజిక న్యాయ భేరి' అని కాకుండా 'సామాజిక అన్యాయ భేరి' అని పెట్టుకుంటే సరిగ్గా సరిపోయేది అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల పాలనలో వెనుకబడిన వర్గాల(బీసీలను) వారిని ఎన్నడూ ప్రధానమంత్రి గాని ముఖ్యమంత్రిగా నియమించలేదని విమర్శించారు. తెలంగాణలో బీసీలకు మంత్రి పదవులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తోందని, కుల గణన పేరుతో బీసీల జనాభా సంఖ్యను తగ్గించే కుట్ర చేసినట్లు ఆరోపించారు. ఈ సభ పేరును సామాజిక న్యాయంతో ముడిపెట్టడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సామాజిక న్యాయ సమర భేరి అని పేరు పెట్టుకున్నారు? అని కాంగ్రెస్ నేతలను బండి సంజయ్ ప్రశ్నించారు.

Next Story