- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Smita Sabharwal: చౌమొహల్లా ప్యాలెస్ ఒక మణిహారం! స్మితా సబర్వాల్ ఆసక్తికర ట్వీట్
హైదరాబాద్ చార్మినార్ సమీప ప్రాంతంలోని చౌమొహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్-2025 (Miss World 2025) ఈవెంట్ కోసం స్వాగత ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే.

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ చార్మినార్ సమీప ప్రాంతంలోని (Chowmahalla Palace) చౌమొహల్లా ప్యాలెస్‌లో మిస్ వరల్డ్-2025 (Miss World 2025) ఈవెంట్ కోసం స్వాగత ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే శుక్రవారం ఎక్స్ వేదికగా తెలంగాణ పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ (Smita Sabharwal) ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘చౌమొహల్లా ప్యాలెస్ ఒకప్పుడు అధికారిక కార్యక్రమాలు, దర్బార్‌లకు, రాష్ట్ర అతిథులకు గౌరవ మర్యాదలు చేసే కేంద్రంగా ఉండేది. హైదరాబాద్ నగరంలో ఒక మణిహారం, అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లో ఒకటిగా నిలిచింది. ఇది 1720 నుంచి 1948 వరకు ఆసఫ్ జాహీ నిజాంల అధికారిక పరిపాలన కేంద్రంగా ఉండేది. విశ్వవిద్యాలయాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, నీటి వనరులు, నగర ప్రణాళిక వారి ప్రత్యేకత. ఈ వారసత్వమే నేటి ఆధునిక హైదరాబాదును తీర్చిదిద్దింది’ అని ఆమె ఫోటోలు షేర్ చేశారు. కాగా, తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ -2025 పోటీల వేడుకలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. మే 7 నుంచి 31 వరకు 72వ మిస్ వరల్డ్ పోటీలు తెలంగాణ పర్యాటక శాఖ (Telangana Tourism) ఆధ్వర్యంలో జరగనున్న విషయం తెలిసిందే.






