Smita Sabharwal: గచ్చిబౌలి పోలీసుల నోటీసులు.. స్మిత సభర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-04-19 09:16:02  IST  )

తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ (Smita Sabharwal)కు తెలంగాణ పోలీసులు (Telangana Police) ఇటివలే షాకిచ్చిన విషయం తెలిసిందే.

Smita Sabharwal: గచ్చిబౌలి పోలీసుల నోటీసులు.. స్మిత సభర్వాల్ సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్/శేరిలింగంపల్లి: తెలంగాణ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ (Smita Sabharwal)కు తెలంగాణ పోలీసులు (Telangana Police) ఇటివలే షాకిచ్చిన విషయం తెలిసిందే. కంచ గచ్చిబౌలి భూముల (Kancha Gachibowli Lands) వ్యవహారం సోషల్ మీడియా వేదికిగా ఫేక్ ప్రచారం చేసినందుకు గాను ఆమెకు నోటీసులు జారీ అయ్యాయి. మార్చి 31న ‘Hi Hyderabad’ అనే ‘X’ (ట్విట్టర్) హ్యాండిల్ పోస్టు చేసిన ఓ ఇమేజ్‌ను స్మితా సబర్వాలా రీ ట్వీట్ చేశారు. HCUలోపల ఉన్న మష్రూమ్ రాక్ ముందు భారీ సంఖ్యలో బుల్డోజర్లు వాటి ముందు నెమలి, జింకను గిబ్లీ ఆర్ట్ శైలిలో ఉన్నట్లు ఆ ఇమేజ్ ఉండటంతో గచ్చిబౌలి పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు.

ఈ నేపథ్యంలోనే తాజాగా పోలీసుల నోటీసులపై పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి స్మితా స్మిత సభర్వాల్ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘X’ (ట్విట్టర్) వేదికగా రియాక్ట్ అయ్యారు. అందులో ఆమె విచారణలో పోలీసులకు సహకరించానని అన్నారు. BNSS చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చానని అన్నారు. తాను ఏదైతే రీపోస్ట్ చేశానో.. అదే పోస్టును 2 వేల మంది చేశారని.. వాళ్లందరిపై కూడా ఇలానే చర్యలు తీసుకుంటున్నారా..? అని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమా.. ఎంపిక చేసిన వారినే టార్గెట్‌ చేస్తున్నారా అని స్మితా సభర్వాల్‌ ఫైర్ అయ్యారు.

Click For Tweet Post..

Next Story