స్మితా సబర్వాల్ ట్వీట్.. వెంటనే డిలీట్.. ఆ వెంటనే క్షమాపణ!

by Disha Web Desk 2 |
స్మితా సబర్వాల్ ట్వీట్.. వెంటనే డిలీట్.. ఆ వెంటనే క్షమాపణ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో డైనమిక్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్‌గా గుర్తింపు తెచ్చుకున్న స్మితా సబర్వాల్ ట్వీట్లు ఇటీవల కాలంలో వరుసగా వివాదాస్పదం అవుతున్నాయి. బిల్కిస్ బానో అత్యాచార కేసులో నిందితులను విడుదల చేయడంపై స్మితా సబర్వాల్ ట్విట్టర్ వేదికగా బహిరంగంగానే విమర్శలు చేసి చర్చనీయాంశం అయ్యారు. తాజాగా బుధవారం స్మితా సబర్వాల్ ట్వీట్స్ ఇంటర్నెట్‌లో చర్చకు దారి తీశాయి. ఆమె చేసిన ట్వీట్ కొంత మంది నెటిజన్లకు ఆగ్రహం తెప్పించాయి. దాంతో తన పోస్టును డిలీట్ చేయడంతో పాటు క్షమాపణలు కూడా చెప్పారు. ముందు చేసిన ట్వీట్‌ను చాలా మంది నెటిజన్లు చూడకపోవడం, ఆ తర్వాత క్షమాపణలు చెబుతూ చేసిన ట్వీట్ కనిపిస్తుండటంతో అసలేం జరిగిందనే విషయాన్ని నెటిజన్లు ఆరా తీయడం మొదలు పెట్టారు.

తంటాలు తెచ్చిన కాశ్మీర్ మ్యాప్:

దసరా ఉత్సవాల నేపథ్యంలో బుధవారం స్మితా సబర్వాల్ వివిధ రాష్ట్రాల్లో స్త్రీ, పురుష నిష్పత్తిని పేర్కొంటూ ఇండియా మ్యాప్‌ను ట్విట్టర్ పోస్టు చేశారు. 'నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భారత దేశం అంతటా దాదాపు ఒకే విధంగా వివిధ అవతారాల్లో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తాం. కానీ స్త్రీ, పురుష నిష్పత్తి మాత్రం కొన్ని రాష్ట్రాల్లో వేర్వేరుగా ఉందని చెబుతూ ఈ మ్యాప్ ఆసక్తికరంగా ఉందని' ట్వీట్ లో పేర్కొన్నారు. ఆమె ట్వీట్ చేసిన మ్యాప్‌లో గుజరాత్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో మహిళల జనాభా పురుషులతో పోల్చి చూస్తే చాలా తక్కువగా ఉంది. అయితే స్మితా సబర్వాల్ పోస్ట్ చేసిన మ్యాప్ లో కశ్మీర్ సంపూర్ణంగా లేదని కొందరు నెటిజన్ల నుండి విమర్శలు వ్యక్తం అయ్యాయి. దాంతో ఆమె తన పోస్టును డిలీట్ చేస్తూ మరో ట్వీట్ చేశారు. 'తాను చేసి ట్వీట్ ఆమోదయోగ్యంగా లేదని మీలో చాలా మంది భావిస్తున్నారు. అందుకు నేను క్షమాపణలు చెబుతూ తొలగిస్తున్నాను. ఎలాంటి మనోభావాలను దెబ్బతియాలనే ఉద్దేశ్యం తనకు లేదు. అందరికీ పండగ శుభాకాంక్షలు.. జై హింద్' అంటూ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, స్మితా సబర్వాల్ ట్వీట్ ను కొంత మంది నెటిజన్లు విమర్శిస్తుంటే పొరపాటును తెలుసుకుని ఆ ట్వీట్ ను డిలీట్ చేశారని అది స్మితా సబర్వాల్ గొప్పతనం అంటూ మరి కొంత మంది మాత్రం మద్దతు నిలుస్తున్నారు.




Next Story

Most Viewed