- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy : SLBC పాపం కేసీఆర్ దే : సీఎం రేవంత్ రెడ్డి
ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Incident)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Incident)పై సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఎల్బీసీ పాపం కేసీఆర్(KCR) దే అని ఆయన మండిపడ్డారు. పదేళ్ల నుంచి ఎలాంటి పనులు చేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. కాంగ్రెస్ హయాంలో 30 కిలోమీటర్లు టన్నెల్ పూర్తైందని, మధ్యలో ఏ పనులు చేయకపోవడం వల్లే మెషీన్ బేరింగ్స్ పాడయ్యాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ కు ఈ ప్రాజెక్టులో ఏం లాభం లేదనే పనులు పక్కకు పెట్టారని, మెషీన్స్ అన్నీ తుప్పు పట్టి పోయి ఉండటం వలనే ఈ ఘోరం జరిగిందన్నారు.
అయితే నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మోడీ అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) విషయంలో నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కమీషన్ల కోసమే నిర్మించారు. ఆ ప్రాజెక్టుతో పని లేకుండానే ఈ ఏడాది 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల దిగుబడి రావడమే ఇందుకు నిదర్శనం అన్నారు.






