- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SLBC Tunnel : ఎట్టకేలకు మొదలైన ఎస్ఎల్బీసీ సొరంగం పనులు!
కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా(Nalgonda District) రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరందించేందుకు (Irrigation-Drinking Water)చేపట్టిన ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ(SLBC) సొరంగం ప్రాజెక్టు(Tunnel Project) పనులు ఐదేళ్ల సుధీర్ఘ విరామానంతరం తిరిగి(Works Begins) ప్రారంభమయ్యాయి.

దిశ, వెబ్ డెస్క్ : కరవు, ఫ్లోరైడ్ పీడిత నల్లగొండ జిల్లా(Nalgonda District) రైతులకు, ప్రజలకు సాగు, తాగునీరందించేందుకు (Irrigation-Drinking Water)చేపట్టిన ఎలిమినేటి మాధవరెడ్డి ఎస్ఎల్బీసీ(SLBC) సొరంగం ప్రాజెక్టు(Tunnel Project) పనులు ఐదేళ్ల సుధీర్ఘ విరామానంతరం తిరిగి(Works Begins) ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో టన్నెల్ బోరింగ్ మిషన్(TBM) మరమ్మతులకు గురవ్వడం..నిధుల కేటాయింపులు లేకపోవడంతో సొరంగం ప్రాజెక్టు పనులు 2019డిసెంబర్ నుంచి మూలపడ్డాయి.
మొత్తం ఇన్ లెట్, అవుట్ లెట్ సొరంగాలు కలిపి 44కిలోమీటర్లు త్రవ్వాల్సి ఉండగా..9.559కిలోమీటర్ల త్రవ్వకం పనులు పెండింగ్ లో పడ్డాయి. అయితే జిల్లాకు చెందిన ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల చొరవతో ప్రాజెక్టు పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి 4,637కోట్ల విడుదలకు నిర్ణయించారు. తొలి విడతగా గ్రీన్ చానెల్ కింద 2200కోట్లు విడుదల చేశారు. టీబీఎం మిషన్ మరమ్మతులు జరిపించగా..ఇన్ లెట్(Inlet)సొరంగంలో టీబీఎం మిషన్ తో త్రవ్వకం పనులను తిరిగి ప్రారంభించారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ పనులను త్వరితగతిన పూర్తి చేస్తే నల్లగొండ జిల్లా రైతుల ఆశలను, ఆశయాలను, దాహార్తిని తీర్చేందుకు సొరంగం దారుల్లో కృష్ణమ్మ పరుగులెత్తి రానుందన్న నమ్మం వ్యక్తమవుతోంది.
ప్రాజెక్టు పనులు త్వరగా చేపట్టడం కోసం గత ఏడాది అమెరికా పర్యటనలో కోమటిరెడ్డి వెంకట రెడ్డిప్రాజెక్ట్ సొరంగం పనులను పూర్తి చేయడానికి ఎక్స్కవేటర్ యంత్రాలను పొందడానికి ఒహియోలోని రాబిన్స్ టన్నెల్ బోరింగ్ మిషన్ కంపెనీ అధ్యక్షుడు, సీఈవో లోక్ హోమ్‌ను కలిసి టీబీఎం మరమ్మతు పరికరాలు త్వరగా వచ్చేందుకు ప్రయత్నించారు. సొరంగం ప్రాజెక్టు పనులు మంత్రులు ఉత్తమ్, వెంకట్ రెడ్డిలు చెప్పినట్లుగా రెండేళ్లలో పూర్తి చేస్తే జిల్లాలో 3.41లక్షల ఎకరాలకు సాగునీరు, 200గ్రామాలకు తాగునీరు అందనుంది.
ఆగుతూ..సాగుతూ
2005లో శ్రీశైలం ఎడమగట్టు కాలువ(SLBC) సొరంగం ప్రాజెక్టుకు ఆనాటి వైఎస్సార్ ప్రభుత్వం 2,200కోట్లతో పరిపాలన అనుమతులు జారీ చేసింది. రూ.1925కోట్లతో 60నెలల్లో పూర్తి చేయాలని నిర్మాణ సంస్థ పనులు పొందింది. శ్రీశైలం జలాశయం నుంచి నల్లగొండ జిల్లాకు 30టీఎంసీల కృష్ణ జలాలను తరలించాలన్నది లక్ష్యం. టన్నెల్ బోరింగ్ మిషన్ తో సొరంగం త్రవ్వకం చేపట్టగా సాంకేతిక సమస్యలు, వరద సమస్యలతో పనులు ఆగుతు సాగుతున్నాయి. ఇప్పటికే 6సార్లు ప్రభుత్వం పనుల గడువు పొడిగించింది. తాజా గడువు కూడా జూన్ 2026వరకు ఉంది. 2017లో ఈ ప్రాజెక్టు అంచనాలను రూ.3,152.72కోట్లకు పెంచారు. తాజాగా మరోసారి 4,637కోట్లకు పెంచారు. ఈ ప్రాజెక్టులో ఇప్పటిదాకా రూ.2646కోట్లు ఖర్చు చేశాు. ఉదయ సముద్రం ప్రాజెక్టు కూడా ఈ ప్రాజెక్టులో అంతర్భాగం.






