SLBC Tunnel : కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్

by Y. Venkata Narasimha Reddy |   (  Updated:2025-03-01 05:38:30  IST  )

ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)లో చిక్కుకున్న 8మంది(Eight persons) ఆచూకీని గుర్తించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) ఎనిమిదవ రోజు కీలక దశకు చేరుకుంది.

SLBC Tunnel : కీలక దశకు ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్
X

దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం(SLBC Tunnel Accident)లో చిక్కుకున్న 8మంది(Eight persons) ఆచూకీని గుర్తించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) ఎనిమిదవ రోజు కీలక దశకు చేరుకుంది. టన్నెల్ 120 మీటర్ల పొడవు.. 1,500 టన్నుల బరువున్న టీబీఎంను ముక్కలుగా కోసిన నిపుణులు వాటిని పక్కకు తప్పించి ముందుకు వెళ్లారు.

టన్నెల్ లోని పరికరాలు, టీబీఎం వ్యర్థాలను లోకో రైల్‌ వ్యాగన్లలో తరలించారు. ఉపరితలంపై నుంచి ఎన్‌ఆర్‌ఎస్‌ఏ, జీఎస్‌ఐ నిపుణుల స్కానింగ్‌ నిర్వహించారు. భూమి పొరల అమరికపై పరిశీలన చేశారు. సోరంగంలో చిక్కుకున్న వారు ఉండవచ్చన్న అనుమానిత ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపట్టారు. టన్నెల్‌ దగ్గర 10 మంది ఫోరెన్సిక్ నిపుణులు ఉండాలన్న ప్రభుత్వ ఆదేశాలతో నలుగురు ఉస్మానియా ఫోరెన్సిక్‌ నిపుణులు హైదరాబాద్ నుంచి టన్నెల్ వద్ధకు చేరుకున్నారు.

ఇప్పటికే ఘటనాస్థలంలో నాగర్‌కర్నూల్‌, వనపర్తి..మహబూబ్‌నగర్‌ మెడికల్‌ కాలేజీల ఫోరెన్సిక్‌ నిపుణులు ఉన్నారు. ప్రమాదంలో చిక్కుకున్న వారు మరణించి ఉంటారన్న కోణంలో వారి మృతదేహాలను గుర్తించి బంధువులకు అప్పగించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే టన్నెల్ వద్దకు మృతుల బంధువులు, కుటుంబ సభ్యులు చేరుకున్నారు. మృతదేహాలను బయటకు తరలించేందుకు ప్రమాద స్థలం వరకు లోకో ట్రాక్ ను సిద్ధం చేశారు. కొద్ధిసేపటి క్రితం నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంత కుమారి, ప్రత్యేక కార్యదర్శి అరవింద్ కుమార్ లు హైదరాబాద్ నుంచి టన్నెల్ ప్రమాద ప్రాంతానికి బయలుదేరారు.


Next Story