- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
SLBC టన్నెల్ ప్రమాదం.. NDRFకు కేంద్రమంత్రి ఆదేశాలు
తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని SLBC టన్నెల్ వద్ద శనివారం ఉదయం సంభవించిన ఘోర ప్రమాదం గురించి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూల్ జిల్లాలోని శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ (SLBC) వద్ద శనివారం ఉదయం సంభవించిన ఘోర ప్రమాదం గురించి తెలిసిందే. ఎడమ వైపు సొరంగం పనులు జరుగుతుండగా.. 14వ కిలోమీటరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఆ సమయంలో అక్కడ విధులలో ఉన్న వారంతా అక్కడే చిక్కుకుపోయారు.
ఈ ప్రమాదంపై కేంద్రమంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. వెంటనే NDRF అధికారులకు ఫోన్ చేసి త్వరగా సహాచక చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విజయవాడ నుంచి రెండు, హైదరాబాద్ నుంచి ఒక బృందం.. మొత్తం మూడు బృందాలు అక్కడికి బయలుదేరాయి. ఈ రోజు రాత్రికి లోపల చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
కాగా, ఈ ప్రమాదంలో ఎనిమిది మంది సిబ్బంది చిక్కుకుపోయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వీరిలో ఇద్దరు ఇంజనీర్లు, ఇద్దరు మిషన్ ఆపరేటర్లు కాగా మరో నలుగురు జార్ఖండ్ కు చెందిన కూలీలు అని ప్రభుత్వం వెల్లడించింది.






