- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SLBC: ఎస్ఎల్బీసీ టన్నెల్‌లో కొనసాగుతోన్న రెస్క్యూ ఆపరేషన్..
ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో NDRF, SDRF, ఆర్మీ (Army), నేవీ (Navi) బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎస్‌ఎల్‌బీసీ (SLBC) టన్నెల్ పైకప్పు కూలిన ఘటనలో NDRF, SDRF, ఆర్మీ (Army), నేవీ (Navi) బృందాల రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. టన్నెల్‌లో పెరుగుతోన్న బురద ప్రవాహంతో సహయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. టెన్నెల్‌లో గల్లంతైన ఎనిమిది మందిని కాపాడే దిశగా రాష్ట్ర ప్రభుత్వం (State Government) శత విధాలా ప్రయత్నాలు చేస్తోంది. అయితే, పైకప్పు పూర్తిగా విరిగిపడటంతో డ్రిల్లింగ్ వేసే టన్నెల్ బోరింగ్ మెషీన్ (Tunnel Boring Machine) భాగాలు చెల్లచెదురుగా పడిపోయాయి. దీంతో ఆ ప్రాంతానికి 40 మీటర్ల వరకు రెస్క్యూ టీమ్ (Rescue Team) చేరుకోలేని పరిస్థితులు నెలకొన్నాయి. టన్నెల్ బోరింగ్ మెషిన్‌ను కదిలిస్తే.. పైకప్పు మరింత కూలే ప్రమాదం ఉందని ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ క్రమంలోనే అక్కడి నేల పరిస్థితులను అంచనా వేసేందుకు అధికారులు ఎన్‌జీఆర్‌ఐ (NGRI), జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI) నుంచి ఎక్స్‌పర్ట్స్‌ను రప్పిస్తున్నారు. అదేవిధంగా టన్నెల్ నుంచి వస్తున్న బురద ప్రవాహం నుంచి జియాలజీ సైంటిస్ట్ (Geology Scientist)లు శాంపిల్స్‌ను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఊటల ద్వారా ఏర్పడిన నీటిని భారీ మోటర్లతో వాటర్‌ను పంపింగ్ చేసున్నారు. సహయక చర్యలు చేపట్టేందుకు NDRF, SDRF, ఆర్మీ, నేవీ బృందాలు 12 కి.మీ వరకు లోకో ట్రైన్‌లో ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడి నుంచి కన్వేయర్ బెల్ట్ (Conveyor Belt)పై 1.5 కి.మీ బృందాలు నడిచి వెళ్తుండటంతో బెల్ట్ ఇప్పటికే లూజ్ అయిపోయింది. ఏ క్షణమైనా బెల్ట్ ఊడిపోయే ప్రమాదం ఉందని తెలుస్తోంది. కొనసాగుతోన్న సహాయక చర్యలను పర్యవేక్షించేందుకు కాసేపట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాద స్థలానికి వెళ్లనున్నారు.






