SLBC: కుప్పకూలిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు.. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కీలక ప్రకటన

by Kema Shiva Kumar |

శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌ (Srisailam Left Canal) టన్నెల్‌ పనులు కొనసాగుతోన్న తరుణంలో ప్రమాదం చోటుచేసుకుంది.

SLBC: కుప్పకూలిన ఎస్ఎల్‌బీసీ టన్నెల్ పైకప్పు.. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీశైలం లెఫ్ట్ కెనాల్‌ (Srisailam Left Canal) టన్నెల్‌ పనులు కొనసాగుతోన్న తరుణంలో ప్రమాదం చోటుచేసుకుంది. టన్నెల్ 14వ కి.మీ మైలురాయి వద్ద సుమారు 3 కి.మీ మేర పైకప్పు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి. కొంతమంది కార్మికులు టెన్నెల్‌లోనే చిక్కుకున్నట్లుగా ప్రాథమికంగా తెలుస్తోంది. విషయం తెలిసిన వెంటనే నాగర్ కర్నూల్ ఎస్పీ వైభవ్ గైక్వాడ్ (SP Vaibhav Gaikwad) ఘటనా స్థలానికి చేరకుని ఇరిగేషన్ అధికారులతో ప్రమాదం ఎలా జరిగిందనే విషయంపై ఆరా తీస్తున్నారు. అనంతరం సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రమాదం సరిగ్గా ఉదయం 8.30 ప్రాంతంలో జరిగిందని అన్నారు.

ప్రమాదం జరిగిన సమయంలో టన్నెల్‌లో సుమారు 50 మందికిపైగా కార్మికులు ఉన్నారని తెలిపారు. కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు రెస్క్యూ ఆపరేషన్ (Rescue Operation) కొనసాగుతోందని అన్నారు. ప్రస్తుతం టన్నెల్‌ నుంచి ముగ్గురు కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చామని తెలిపారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని జన్కో (GENCO) ఆసుపత్రికి తరలించామని అన్నారు. కాసేపట్లో ఘటనా స్థలానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Minister Uttam Kumar Reddy) రానున్నారని ఎస్పీ వైభవ్ గైక్వాడ్ పేర్కొన్నారు.

Next Story