స్కై వారియర్స్.. మన్‌ కీ బాత్‌లో సంగారెడ్డి మహిళలను ప్రశంసించిన ప్రధాని

by Ramesh Naini |   (  Updated:2025-06-14 15:17:31  IST  )

నారీ శక్తికి ఉదాహరణగా తెలంగాణ మహిళలు నిలిచారు. మన్‌ కీ బాత్ లో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలోని సంగారెడ్డి మహిళలను ప్రశంసించారు.

స్కై వారియర్స్.. మన్‌ కీ బాత్‌లో సంగారెడ్డి మహిళలను ప్రశంసించిన ప్రధాని
X

దిశ, డైనమిక్ బ్యూరో: నారీ శక్తికి ఉదాహరణగా తెలంగాణ మహిళలు నిలిచారు. ఈ మేరకు ఆదివారం నిర్వహించిన మన్‌ కీ బాత్ (Mann Ki Baat) కార్యక్రమంలో జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Modi) గ్రామీణ భారతంలో అద్భుతమైన మహిళా సాధికారతకు ఉదాహరణగా నిలిచిన తెలంగాణలోని సంగారెడ్డి మహిళలను ప్రశంసించారు. ఒకప్పుడు వ్యవసాయ పనులకు ఇతరులపై ఆధార పడిన మహిళలు ఇప్పుడు సొంతంగా డ్రోన్ల ద్వారా సాగు చేస్తూ (Sky Warriors) "స్కై వారియర్స్"గా మారారని ప్రధాని మోడీ చెప్పారు. 50 ఎకరాలకు పైగా సాగు చేస్తున్న పంట పోలాల్లో పురుగు మందులను పిచికారి చేయడానికి డ్రోన్లను ఉపయోగిస్తున్నారని అన్నారు.

దీనివల్ల వారు తీవ్రమైన ఎండ, విషపూరిత రసాయనాల బారిన పడే ప్రమాదం తగ్గడంతో పాటు పని సమర్థత పెరిగిందని వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఎక్స్ వేదికగా ఈ వివరాలను కిషన్ రెడ్డి (Kishan Reddy) పంచుకున్నారు. తెలంగాణ మహిళలను చూసి గర్విస్తున్నానని ఆయన తెలిపారు. ఈ మార్పు.. నూతన సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నారీ శక్తిని శక్తివంతం చేయడంలో మోడీ ప్రభుత్వం చూపిస్తున్న అంకితభావానికి నిదర్శనంగా నిలిచిందని వీడియో షేర్ చేశారు.

Next Story