- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తారామతి రిసార్ట్ పార్టీ.. ఆరుగురికి గంజాయి పాజిటివ్?
by Naga Rani Yarlagadda |
గోల్కొండ తారామతి రిసార్టులో గత రాత్రి జరిగిన పార్టీలో డ్రగ్స్ వాడినట్లుగా పోలీసులు తెలిపారు.

X
దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని గోల్కొండ తారామతి రిసార్టులో మోర్ దేన్ ఫ్రెండ్స్ పేరుతో నిర్వహించిన ఈవెంట్ పై.. ఈగల్ టీమ్ రైడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కు 200-300 మంది హాజరవ్వగా.. వారిలో పలువురు బాలీవుడ్ కు చెందినవారు కూడా ఉన్నారు. పార్టీలో మద్యం ఏరులై పారగా.. అనుమానంతో 36 మందికి డ్రగ్స్ టెస్ట్ చేశారు. వీరిలో 6 మందికి డ్రగ్స్ పాజిటివ్ రాగా.. వారిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల్లో భార్యభర్తలు, ఒక మేల్ మోడల్, ఇతరులు బిజినెస్ చేస్తున్నట్లు గుర్తించారు. వీరిని మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచిన తర్వాత రిహాబిలిటేషన్ సెంటర్ కు పంపుతారని తెలుస్తోంది. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఈగల్ టీమ్ కృషి చేస్తుండగా.. మరోవైపు ఇలాంటి పార్టీల్లో డ్రగ్స్, గంజాయి వాడకం కొత్త సవాళ్లను విసురుతోంది.
Next Story






