బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పోలీసుల అదుపులో ప్రవళిక ఆత్మహత్య నిందితుడు శివరాం రాథోడ్

by Disha Web Desk 12 |
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. పోలీసుల అదుపులో ప్రవళిక ఆత్మహత్య నిందితుడు శివరాం రాథోడ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ బీఆర్ఎస్ ప్రభుత్వానికి, పోలీసులకు ప్రవళిక ఆత్మహత్య కంటిమీద కునుకు లేకుండా చేసింది. గ్రూప్ 2 ఎగ్జామ్స్ వాయిదా కారణంగా యువతి ఆత్మహత్య చేసుకుందని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.కానీ పోలీసుల విచారణలో ప్రవళిక తన ప్రియుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని తెలిపారు. దీంతో ఈ వివాదం మరింత దుమారం రేపింది. దీనికి తోడు బాధితురాలి తల్లి, తమ్ముడు ప్రగతి భవన్‌లో కేసీఆర్ ను కలిసిన అనంతరం.. ప్రవళిక తన ప్రియుడి వేదింపులు తాలలేకనే ఆత్మహత్య చేసుకుందని. అతన్ని పట్టుకుని కఠినంగా శిక్షించాలని ఓ వీడియోలో పేర్కొంది. దీంతో పోలీసులు నిందితుడైన శివరాం రాథోడ్ కోసం గాలింపు చర్యలు చెపట్టారు. ఈ క్రమంలో అతను మహారాష్ట్ర థానేలో పోలీసులకు పట్టుబడినట్లు తెలుస్తుంది. కాగా నిందితుడిని పోలీసులు హైదరాబాద్ తరలిస్తున్నట్లు తెలుస్తుంది.

Next Story

Most Viewed