- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'కాసులు' కురిపిస్తున్న సీతారామా..!
ఇరిగేషన్ శాఖలో ఉండే ఓ అధికారి ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేందుకు భారీ కుంభకోణానికి పాల్పడినట్లు, ఇప్పటికీ పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి...

'కాసులు' కురిపిస్తున్న సీతారామా..!
- సీతారామలో సైతం భారీ కుంభకోణం...?
- చక్రం తిప్పిన ఓ ఉన్నతాధికారి
- ఏఈ అతడే, డీఈఈ అతడే, ఈఈ అతడే.. చెప్పుకుంటూ పోతే సర్వం అతడే
- ఉన్నతాధికారుల అండదండలు పుష్కలం?
దిశ, కొత్తగూడెం: 'వడ్డించేవాడు మనవాడు అయితే చివరి బంతిలో కూర్చున్నా మనకు తృప్తిగా దొరుకుతుందనే సామెతను ఈ అధికారి నిజం చేస్తున్నాడు... కంచె చేనును మేస్తే ఇక ఎవరు పట్టుకోగలరు' అన్నట్లుగా ఇరిగేషన్ శాఖలో ఉండే ఓ అధికారి ప్రభుత్వ ఖజానాన్ని కొల్లగొట్టేందుకు భారీ కుంభకోణానికి పాల్పడినట్లు, ఇప్పటికీ పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి... ప్రభుత్వాలు ఏ లక్ష్యంతో అయితే అభివృద్ధి పనులు చేపడుతున్నాయో ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది అక్రమార్కులు అడ్డుపడుతున్నారు.. ఎందుకంటే ప్రభుత్వం చేపట్టే ఏ అభివృద్ధి పనిలోనైనా సైతం కాసుల కోసం కక్కుర్తి పడే అక్రమార్కులే ఎక్కువగా ఉన్నట్లు అవగతం అవుతోంది. చివరి ఆయకట్టు భూములకు సైతం సాగునీటిని అందించి రైతుల పంటలను సస్యశ్యామలం చేయాలని గత ప్రభుత్వంలో చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ఇప్పుడు అధికారులు, కాంట్రాక్టర్లకు కాసులు కురిపించే బంగారు బాతులా తయారైంది. ఇక్కడ అంతా మనదే... మనం చెప్పినట్లే లెక్కలు.. ఎంత రాస్తే అంత అనుకుంటున్నారో ఏమో తెలియదు కానీ వందలు.. వేలు.. లక్షలు... కాదు ఏకంగా కోట్లకే ఎగనామం పెడుతున్నారు ఈ ప్రబుద్ధులు.. కాళేశ్వరం కుంభకోణానికి తామేమి తక్కువ కాదన్నట్లుగా సీతారామాలో సైతం భారీ కుంభకోణానికి తెగబడ్డారు. తమ తప్పులు బయటపడకూడదని కింది స్థాయి నుంచి పై స్థాయి అధికారులు సైతం ముడుపులు ముట్ట చెబుతున్నారని ఆరోపణలు బహిరంగంగానే వినబడుతున్నాయి.
భారీ స్థాయోల కుంభకోణం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సీతారామ ప్రాజెక్టు కింద జరుగుతున్న ఇరిగేషన్ పనులలో అధికారులు కాంట్రాక్టర్లతో కలిసి భారీ స్థాయిలో కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. సంబంధిత సిబ్బందే జరిగిన అవినీతి గురించి బహిరంగంగానే చర్చించుకుంటున్నట్లు తెల్సుస్తుంది. సీతారామా ప్రాజెక్ట్ ప్రధాన కాలువల నిర్మాణంలో అధికారులు,కాంట్రాక్టర్లు కుమ్మక్కై బారీ స్థాయిలో కోట్ల రూపాయలు దండుకున్నట్లు సమాచారం..సీతారామా ప్రాజెక్ట్ లోని ప్రధాన కాలువల నిర్మాణంలో సి ఎం, సిడి స్ట్రక్చర్ నిర్మాణాలకు ఒరిజినల్ ఎస్టిమేట్ లో ఉన్న కాంక్రీట్ క్వాంటిటీ కాకుండా,ఎక్కువ క్వాంటిటీ ని చూపించి నిర్మాణం చేయకుండా అధికారులు,కాంట్రాక్టర్లు కలిసి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకున్నారని సంబంధిత అధికారులే బహిర్గతంగా చర్చించుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.. లైనింగ్ కాంక్రీట్ క్రింద సబ్ బేస్ కు ఇసుకను వాడకుండానే వాడినట్లుగా చూపించి కోట్ల రూపాయల బిల్లును అధికారులు తీసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.అదేవిధంగా ప్రధాన కాలువల్లో వెలువడే రాయిని,మట్టిని కూడా అక్రమంగా అమ్ముకొని భారీ స్థాయిలో దోపిడీకి పాల్పడ్డట్లు తెలుస్తోంది..ఈ విషయంలో కొంతమంది విషయాన్ని బహిర్గతం చేసేందుకు పలుమార్లు సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగితే సంబంధిత అధికారులు దాట వేసే ధోరణిని ప్రదర్శిస్తున్నారు.. సమాచారం ఇస్తే బండారం మొత్తం బయటపడుతుందని ఉద్దేశంతో దాటవేసే ధోరణిని అవలంబిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ భారీ కుంభకోణాన్ని మొత్తం ఒక్కొక్కటిగా బహిర్గతం చేసి మొత్తం బండారాన్ని బహిర్గతం చేస్తామని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు.
సీతారామ సమాచారం కోసం ఆర్టీఐలో ఫిర్యాదు.
సీతారామ ప్రాజెక్టులో గల ప్రధాన కాలువల నిర్మాణంలో భాగంగా సీఎం& సీడీ స్ట్రక్చర్స్ నిర్మాణాలకు సంబందించి ఒరిజినల్ ఎస్టిమేట్ లో ఉన్న కాంక్రీట్ క్వాంటిటి కాకుండా ఎక్కువ క్వాంటిటీ పెట్టి, నిర్మాణం చేయకుండానే ఇక్కడి అధికారులలో కొందరు డీ ఈ , జె ఈ, ఈ ఈ లు కాంట్రాక్టర్లతో కలిసి డబ్బులు పంచుకుంటున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు వేసిన లైనింగు కాంక్రీట్ క్రింద సబ్ బేస్ లాగా ఇసుక వాడకున్న వాడినట్లు కోట్ల రూపాయల బిల్ కొందరు డీ. ఈ .ఈ, జె. ఈ., ఈ .ఈ లు కాంట్రాక్టర్లకు అప్పజెప్పి, వాటాలు తీసుకున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది. కానీ ఒక్క క్యూబిక్ మీటర్ ఇసుక కూడా వేయకుండా నే, వేసినట్లు లెక్కలు చూపిస్తున్నట్లు సమాచారం. ఈ అంశంపై ఒక వ్యక్తి సంబంధిత వివరాలు, ఎం బుక్ కొలతలు సర్టిఫై చేసి ఇవ్వమని పలువురు సమాచార హక్కు చట్టం ద్వారా కోరితే సమాచారం ఇవ్వడం లేదు. సీతారామ ప్రాజెక్టులోని పని చేస్తున్న ప్రధాన కాంట్రాక్టర్, సబ్ కాంట్రాక్టర్ ల వివరాలు అలాగే ప్రధాన కాంట్రాక్టర్ వారి పనులను సబ్ కాంట్రాక్టర్ కేటాయించవచ్చుననే ప్రభుత్వ జీ ఓ లేదా ఆర్డర్స్ ఏమైనా ఉంటే వాటి నకళ్లు ఇవ్వమని సమాచారకు చట్టం ద్వారా అడిగితే సంబంధిత ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రధాన కాలువల త్రవ్వకాలలో వెలువడిన రాతిని అక్రమంగా అమ్ముకుంటూ, ప్రభుత్వానికి రావాల్సిన డబ్బుని కాజేస్తున్నారు అని పలువురు ఆర్టీఐ లో ఫిర్యాదు చేసారు,కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడం పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.






